పుట:Snehageetalu.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

<poem>
నామ చింతనమున నడుచుచుండు
నియమనిష్టలందు నిర్గుణ నామమ్ము
తలచువాని కెట్టి తరుగులేదు 427

అన్నితావులందు ఆచారవంతులే,
సత్య మరయువారె చాలరైరి
కోటి ఆచరణలు కొఱగావు ఋజువుకు
సత్యమందెదాగి జయముకలదు 428

తెలిసి పలుకుమాట వెలకట్టలేనిది
తూచి పలుగునపుడె దొడ్డతనము
ఎదనుబట్ట వలయునేమాటలైననూ
పెదవినుంచి పలుక ప్రియుడు వినడు 429

కులము గోత్రమంచు కుమ్ములాటలుయేల
జ్ఞానమెట్టి కులము చాటగలవె?
పొరుగువానికెవడు ఇరవుగా నిలుచునో
అతడె గొప్పవాడు అవనికంత 430

అహము గలుగుచోట ఆయోగ1 ముండదు
విత్తి గలిగెనేని విచల2 ముడుకు
తెరవు3 తెలియలేక దేవులాటలు యేల
నెగవు4 తెగిన నీకు నీవె గురువు 431

కూలి లేనిచోట కొలువు చేయగరాదు
బుద్ధిలేని తనువు భూమిమోత
ఎఱుకలేని యోగమెంతైన ఫలమేమి
బూది పూసుకున్న బోధియగునె? 432

మూర్ఖునెంత జేసి మురిపించిచెప్పనా
సుంత మార్పునైన చూడబోము
వాడి శరము కఱకుబండపై విడిచిన
పదువుబోవు గాని ఫలితమేమి? 433

రసములారు గలుగ రసభోగమబ్బెను
అనుభవించు జిహ్వ ఆనికయ్య
దొంగ చెంతజేఱి చొంగకార్చెడి కుక్క
ఏమి కాచగలుగు? నెవని బట్టు? 434

పగలు భుక్తి మాని పరమాత్మ స్మరణమ్ము
మాంస భక్షణమ్ము మాపటేళ
ఇట్లుసేయ విభుడు ఎట్లు సంతోషించు
ఒకటి యర్పణమ్ము యొకటి హత్య 435

ఎండు రొట్టలిచ్చి యెలమి1 చూపిన చాలు
క్షుత్తులారి ప్రభుని కొలుచువాడ
కాలగతిని చివుకు కట్టెకు రుచులేల?
ఆకులలములైన అమృతమగును. 436

అలఘు సృష్టిలోన తొలిరూపు ఒక్కటే
సర్వశక్తియుతుడు సర్వసాక్షి
సృజన చేయనెంచి సృష్టించె నాదంబు
అది అనాహతమను అద్భుతమ్ము 437

ఏడు లోకములు ఏడు స్వరములును
జీవజనితమయ్యె చిత్తవృత్తి
అచట శబ్దశక్తి ఐదు రూపులుబొందె
పంచబ్రహ్మలయ్య సంచితముగ 438

అతని యోగశక్తి అక్షరుండైపుట్టె
సర్వసృష్టి కతడు సారభూతి
నాలుగంశ లకట నాల్గువేదములయ్యె
కాలచక్రగతులు ఖాయ1 మయ్యె 439

ఊర్పునందు ‘సోహ’ ముద్భవించెనపుడు
అమృతధామ మనగ నలురుచుండు
ఎనిమిదంశలందు ఏకమై రుచిరమై
అండముద్భవించె హంసదీప్తి 440

అక్షరకు నిద్ర అంతర్హితమ్మయ్యె
నీలవర్ణ శక్తి నీటజేరె!
శబ్ద ముద్రచేరి చైతన్య జ్యోతియౌ
<poem>