పుట:Snehageetalu.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

<poem>
ఎంత చోద్యమంచు అంతర్ముఖుడనైతి
నేనె చెడుగుననెడి నిజముతెలిసె 413

‘నాది’ యన్నదేది నాయందు కనరాదు
‘నీది’ గాక అన్యమేది లేదు
నీది నీకుజేర్చు నేర్పుదొరకెనేని
అంతకన్న భాగ్యమందగలమె 414

ఎంత ప్రతిభయున్న అంత ప్రాభవముండు
ప్రాభావమ్ము పెరుగ ప్రభువు పోవు
మత్తగజము తలను మట్టి జల్లుకొనును
చీమ పంచదార స్వీకరించు 415

ఎంత జ్ఞానముండి యేమిలాభము చేరు
దయ కలిగినవాడె ధర్మపరుడు
కరుణలేనివాడు కర్మబంధనమున
నరకప్రాప్తిపొందు, నమ్ముమయ్య 416

ఎవరిమీద జాలి ఎవరిమీద కఱకు
ఎవరికెవెరు కర్తలెవరు భువిని
కపిశ1 మైనగాని కఱటి2 యైనగాని
అజుని సృష్టిలోన అంశగాదె 417

సత్యమునకునెట్టి సాక్ష్యమక్కరలేదు
కల్లమించినట్టి కలుషమేది
సత్యమున్నచోట స్వామియూ నివసించు
ఋతము కానిదేది హితవుకాదు 418

సత్యరూపుడైన జగదీశ్వరుని తోడ
సత్యబంధమెపుడు సాగగలదు
బద్ధులాడుటన్న భగవానునికి రోత
సతము సత్యప్రియుడు స్రవసాక్షి 419

సత్యమునకు నెచట శాపమంటదు సుమ్ము
సత్యస్థితికి నెందు చావులేదు
సత్యమన్నియెడల సత్యమ్మునే చేరు
తెలసి సత్యమందె మెలగుమోయి 420

స్పర్శ నెడము సేయ సౌవర్ణ1 మెట్లుండు
సత్య స్పర్శలేక సాధనేది
ప్రేమకంచుకమును పేర్మితో ధరియించు
సత్యవ్రతుని సతము సన్నుతించు 421

సత్యమెవనికేని సమ్మతి కాబోదు
కల్లపట్ల మోజు కలిగియుండు
పాలు తిరిగి తిరిగి పలుచోట్ల అమ్మంగ
కల్లు ఉన్నచోటె చెల్లపోవు 422

ఎవని యెదను సత్యమెప్పుడూ పండునో
అతడె అన్ని యెడల అధికుడగును
శమము2 దొరకదెచట శతకోటి పోసినా
సత్యమున్నచోట శాంతముండు 423

బోధ గురుని జేరి బోధించ రమ్మనని
యడుగ లజ్జగలుగు నాత్మలోన
అంధునెదుట నాట్యమాడంగ హితవేమి
ఆత్మనెఱిగిన పరమాత్మ తెలియు 424

జ్ఞానియైనవాడు జ్ఞాని తాననుకోడు
పాఠమిచ్చినంత ప్రాజ్ఞుడవడు
అరయ గలిగెనేని అద్వైత సత్యమ్ము
తనను తాను తెలిసి తనియగలడు 425

నీటి బొమ్మ ; మేన నిండియున్నది గాలి
ఉర్వి మీద బుట్టి ఉనికిబొందు
ప్రతిమలోని గాలి పలుబాసలనుబల్కు
అందు దివ్వెవోలె అజుడు వెలుగు 426

విషయవాంఛలన్ని విడిచి పెట్టిననాడు
<poem>