పుట:Snehageetalu.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

<poem>
పరుల దోషమరసి పరిహసింపకు మీపు
తలతుకొనుము నీదు తప్పులన్ని
తప్పు తెలుసుకొనుచు దారి వెతుకువాడు
బుద్ధుడగును, జ్ఞానసిద్ధుడగును. 371

మాయ, ఛాయ ఒక్క మార్గమైచరియించు
పరుగులెత్త వెంటతరుముకొనుచు
తిరిగి ఎదుట నిలువ దరిదాపుకైననూ
తొంగిచూడబోవు నంగివోలె 372

‘మాయ’ చెట్టువోలె మదిలోన వ్యాపించు
కొమ్మరెమ్మ పెరిగి కొలసుదేరు
నమ్మి దాచుకొన్న నరకమ్ము ప్రాప్తించు
నరికివేయి విభుని దరి లభించు 373

‘మాయ’లోన మనిషి మానవత్వము మరచి
కూడబెట్టుకొనును కోట్లు కోట్లు
ఎంత కూడుకున్న సుంతవెంటనురాదు
కరిగిపోవుక్షణము కలదు నిజము 374

ఎట్టి జ్ఞానినైన పట్టివిడదు మాయ
మునులు జడులనైన మోసపుచ్చు
ఎదను గుచ్చి గుచ్చి వేధించునెప్పుడూ
మాయ బాయువాడె మర్మమెరుగు 375

లోకమంతగప్పె లోలాక్షి మోహమ్ము
కలికి వెంటనుండు కాంచనమ్మ
పత్తిబడెను నిప్పు ఫనితమేమగునోయి
తప్పుకొనుము మాయ దారినుంచి 376

రామునెరిగి నేను రామ నై పోవంగ
మరులుగొంటి మాయ నెరుగలేక
హరికి నాకు నడుమ అడ్డమైనిలిచిన
మాయతుంచి విభుని డాయగలనె 377

జ్ఞానమనెడు పెద్ద గాలి వీచినచోట
భ్రాంతివల్ల కలుగు భయముపోయె
నామమందు నాకు ప్రేమకల్గెనపుడు
మాయతెఱలు రూపుమాసినపోయె 378

తినుట కెవ్వడేని తియ్యదనము కోరు
వేము తినుట కెవడు వేడ్కపడడు
విభుడు రోగమెరిగి వేపపూవిచ్చెను
చేదు స్వీకరించు ! చేటుదప్పు ! 379

మాయ పెనుకుటజము, మమత దాని ఫలమ్ము
మూడుగుణములందు మూలదాగె
విషయ సంతసములు విటప శాఖలగును
మెయి తపించుగాక, మేరలేదు 380

‘మాయ’ దివ్వెవోలె మరులు కల్పించును
నరుడు పురుగువోలె తిరిగుచుండు
దీప భృంగ న్యాయ దిశలోన పయనించి
కడకు దివ్వెలోనె కాలిపోవు 381

నామజపముచేసి రాముని కొలిచేటి
మనసు గలుగు కోట్ల జనులలోన
కాంత కనక మనెడి కనుమలధిగమించి
గమ్యమరయు వాని కానగలమె? 382

ఆటవెలది నీడ అగుపించునంతనే
అంధుడగును విటుడు ఆశచేత
ఎల్లవేళలందు ఎలనాగ తోడైన
చెప్పగలమే వాని చింతలెన్నో 383

పదనుగలుగు కత్తి పరనారిమోహమ్ము
కూకటేళ్ళతోడ కూల్చివేయు
రామసతినిగోరి రాక్షస రారాజు
వాలిపోయినట్టి వైనమిదియె 384
<poem>