పుట:Snehageetalu.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

<poem>
మాయచేతబడిన మహనీయులైననూ
జారిపోక నిలువలేరు సుమ్మీ 356

మానమెపుడు కుక్క; మరియాద తెలియదు
ముద్దుచేసిచూడు మూతినాకు
వైరమూనుగాక చేరి యొడలునాకు
ఎట్టిగతిని విడిచిపెట్టబోదు 357

కాస్త నీడలేదు కాయలందగరావు
ఖర్జురంపు చెట్టు కలుగనేమి?
పుట్టి పెరుగుటొకటి కట్టబోదు సుగతి
అహమువిడిచి ప్రభువునరయవలయు 358

అహము గలిగనేని ఆపద వెన్నంటు
సంశయమ్ము పైన సంకటమ్ము
శంకలేక సతము పంకజాక్షునిగొల్వ
నాల్గురోగములు నయముగావె! 359

మాయతొలగినంత మాత్రాననేమగు
అహము విడిచిపెట్ట నలవిగాదు
అహమువిడక ఋషులు సహనమ్ము కోల్పోయి
స్థితినిబాయలేదె మతినిదప్పి 360

మాయలాడిమాట మధుబీజపుష్పమ్ము1
అంతరమ్ము తెలుపు అంచు ఎఱువు
తీపిపూతబూసి తూరుతీరుగ బల్కు
కఱటి మాటనమ్మి కఱగిపోకు 361

ఎదుట ప్రేమజూపి యెంతయో మురిపించు
వెనక గొయ్యతీసి వేడ్కజూచు
కపటిమాటలోని కౌటిల్యమెంతయో
ఎఱిగి మసలువాడె యోగ్యుడగును 362

ఆశ చంపుకొనక ఆసనమ్మెక్కినా
మార్గమేల దొరకు మాయలోన
గాండ్లవారి ఎద్దు గాటనే తిరుగంగ
ఇల్లు దూరమౌట ఎరుగలేదె ! 363

సాధువైననేమి బోధకుండగునేమి
ఆశవిడనివాడు దాసుడగును
ఆశ మొదట నీకు అవరమ్మనిపించు
పిదప నిన్నెబట్టి పిప్పిజేయు 364

మూటగట్టువాడు కోటనెత్తుకుపోడు
ముల్లెపనికి రాదు ముందుగతికి
‘భావి’కుపకరించు భాగ్యమ్ము కూర్చుకో
భక్తి భాగ్యశీలి శక్తిచూడు 365

ఆశ బూచివోలె అసువులు కబళించు
తీరుకొలది కోర్కె తీవసాగు
తృష్ణ చావునపుడు తృప్తిలేని బ్రతుకు
దఃఖమయము మిగుల దురితపధము 366

సాధువెక్కడైన జారూకతనుండు
నిదురలోన ధ్యాననియతనుండు
జీవమాగిపోవ చేయగల్గునదేమి
చలనమున్నవాడె చక్కబడుము 367

నిద్ర మరణమునకు నిజమైనరూపమ్ము
లెమ్ము వేగ మేలుకొమ్ము సఖుడ!
నిదుర వదిలిపెట్టి నీలరూపునిబట్టు
చేయిబట్టి నిన్నుచేర్చు గట్టు 368

నిన్ను పొరుగువాడు నిందజేయగనెంచ
అతని ఎదనుజేర్చి యాదరించు
నీరు సబ్బలేక నిర్మలత్వమురాదు
ఔషధమ్మె నీకు అతనిమాట 369

గడ్డిపోచకూడ కాదోయి హీనమ్ము
తీసి వేయబోకు తూరుజూచి
ఎరిగి కంటబడిన యేమౌను నీకళ్ళు
తరచి చూడనిదియె తత్త్వమోయి 370
<poem>