పుట:Snehageetalu.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

<poem>
పాము తేలు కాటు పదునైన విషమును
మంత్రశక్తి వలన మాన్పవచ్చు
వికటనారి పట్టు విడువ శక్యముగాదు
గుండె కొఱకి కొఱకి గూడుకట్టు 385

కావుసుందరుములు కామినీ అందాలు
అవి వినియోగ వెతలకానవాళ్ళు
అంటుకత్తెపొందు అంతమ్మునకు నాంది
సర్పకాటుకన్న సంకటమ్ము 386

అష్టవిధ మదముల నరికట్ట గలవారు
కానరారు నాదు కంటికెచట
మదము గెలచినపుడు మధువైరి దరిదక్కు
ప్రల్లదనపు ఫలము కల్లగాదె 387

నామ మత్తనందు నడుచు వారెప్పడూ
విభుని నామస్మరణ విడువలేరు
విడని భజనకన్న విలువైన సంపద
నరుని జన్మకెచట దొరుకబోదు 388

శీలమున్నచాలు చెదరని మరియాద
శీలమున్నవాని కాలమరయు
ఓజ1 లేనివాడు భూజానియయ్యునూ
నుడికి విలువలేదు పొడుగురాదు 389

శీలమున్నవాడు సిరులున్న వాడౌను
అన్ని రత్నములకు నతడె నెలవు
ఒక్క శీలమున్న వొదుగు సంపదలన్ని
ధరను శీలయుతుని దారివేరు 390

జ్ఞాలుందురిలను, జడధారులుందురు,
ధ్యానసిద్ధులుండు, దాతలుండు,
శూరులందురుర్వి వీరుల తరుగేల
అకట! శీలవంతు నరయగలమె? 391

కడలివోలె గుణము కడులోతుగానుండు
శీలమరయు సాక్షి చిక్కలేదు
శీలముగలవాడు శివునితోతుల్యుండు
శీలమొకటె గొప్ప చిత్తవృత్తి. 392

తాల్మిలేనివాడు తాపసి యగుగాక
ఫలము గలుగబోదు బాధతప్ప
భృగువు తన్నినంత పృధివీశ్వరునకేమి?
ఓర్పుగలుగు వాడె నేర్పుకాడు. 393

దయ కలిగినచోట ధర్మమ్ము నిలుచును
ఎచట లోభమున్న అచటెయఘము1
క్రోధమున్నచోట కోరి మృత్యువునిల్చు
సహనమున్నచోటు శౌరి నెలవు 394

ఖలుని మాటలెన్న ఖడ్గతుల్యమ్ములు
హితవు కోఱువాని హింస పెట్టు
అశనిపాత మొదవ అంబుధికేమౌను
ఓర్మి సాటిలేదు, మర్మమిదియె. 395

ధరణి యోర్చుకొనును త్రవ్వినా, నాటినా
విటపి యోర్చుకొనుచు విరచివేయ
తప్పులెన్నియున్న దైవమోర్చుకొనును
తలచ మనిషికెందు తాత్మిలేదు. 396

ఆమని తిరియంగ ఆకులు త్యజియించె
తరువు ! కాలగతిని తలచుకొనుచు
పల్లములు గలిగి ఫలితమ్ము తాపొందె
ఈవి ఎక్కడైన ఈటబోదు 397

ఇంట పెరుగు ధనము ఇంటికేమోలమ్ము
పడవలోన నీరు పడవముంచు
ముంచుగాని గూర్చి మురిపెమ్ముబడనేల
పేద సాద కింత పెట్టరాదె? 398

కులము గొప్పదంచు కులుకంగనదియేల
<poem>