పుట:Snehageetalu.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

<poem>
ఫలితమేమి? దాని ప్రాప్తమేమి? 313

పాశమున్నచోట పరితోష1 ముండదు
సుఖముకోర నెందు చోటులేదు
పవలు రేయి శ్వాస ప్రస్థానభేరులు2
మ్రోగుచుండె భద్రమోయి సఖుడ! 314

తంత్రి తెగిననాడు జంత్రమేమి పలుకు
వాడిపోవు విరికి వాసనేల!
వంతువచ్చునాడు తంతు తప్పదులెమ్ము
కంటినీటిక్రతువు! మంటతీర్పు! 315

మల్లుగ్రుచ్చి నిన్ను రొల్లు బెట్టుడువాని
అలరులిచ్చి మిగులనాదరించు
పూవుబదులు విభుడు పూవునేఅందించు
ముల్లునాటువాడు ముల్లుపొందు 316

బలములేని వాని బాధింపనొల్లకు
అతనియూర్పు4 మిగుల అదటు5 సుమ్ము!
భస్త్రి లోహములను భస్మమ్ముసేయగా
ప్రాణి ఉసురు వ్యర్ధభావమగునె? 317

మాటలందు గర్వమాత్సర్యుములు లేక
మనెడువాడు బుద్ధింమంతుడగును
మాటచల్లనైన మహిని వైరియెవరు?
పొగరువిడిచి ధరణి పొందుసుఖము 318

జ్ఞానహస్తి మీద ధ్యానసమాధినే
పరువుజేసి దాన్ని పరచుకొంటి
కుక్కవంటి లోకులెక్కుడై మొఱిగినా
తరుగురాదు తపము కరిగిపోదు 319

కడుపుకెట్టి తిండి కడుకోర్కెతిందువో
మనసు అట్టి దారి మసలుచుండు
నోటికెట్టి రసము పాటుగాగుడుతువో
నాలుకట్టి రసము పొత్తు నడుచుచుండు 320

సాటివాని తిరియ చావుతో సమమౌను
పెట్టువాడె ఎవడు పెనువుకాడు
ముష్టిబ్రతుకుకన్న మృతిచెందుటే మేలు
గురుని మాటలివియె మరువబోకు 321

కడపుబట్టినంత కబళమ్ము సమకూర్చు
ఒడలుగప్పునంత మడుపు1 చాలు
పోగుచేయువాడు పూజనీయుడుకాడు
దైవకృపను తప్పి దక్కబోదు 322

అఘము2 విడిచిబెట్టి అనువైనబుద్ధితో
తేటతెల్లనైన బాట నడువు
కాకినడక విడిచి కలహంసగమనమ్ము
నేర్చుకొనుము, బ్రతుకు మార్చుకొనుము 323

తీయనైనమాట తీర్చునెదుటి బాధ
పరుషవాక్కులెపుడు శరసమమ్ము
మాటతెలిసినపుడె మాధవుండు తెలియ
పలకరింపులోనె ఫలితముండు 324

చదివి చదివి గుండె చట్టబారెనుగాని
కదలలేదు హృదయకమలమింత
రాసి రాసి కటికరాళ్ళు మిగిలెగాని
ప్రేమ అంటలేదు పేరుకైన 325

తప్పు చేయనేల తాపమ్ముబడనేల?
పనినిబట్టి గలుగు ఫలితమెపుడు
ముళ్ళచెట్లు నాటి పళ్ళుకోరగనేల
సర్వవిదితమైన సత్యమిదియె 326

చోఱచిత్తుడొకడు జాఱచిత్తుడొకడు
తీర్థమాడబోయె దివ్యనదికి
జలకమాడినంత మలినమ్ము తొలగునా
పాపభరముపోదు, పండిపోవు 327
<poem>