పుట:Snehageetalu.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

<poem>
రేపుతలతునుంచు ఆపబోకుము సుమ్ము
కాలమెపుడు నిన్నె కాచియుండు 299

ఐదు ‘నౌబోతు’1 లును ఐక్యమై మ్రోగెనో
ముప్పుదారు రవములప్పగిలెనో
అట్టిమందిరమ్ము నిట్టనిల్వునగూలు
కాకి కొల్వుదీరు కావటంచు 300

కోడెవయసుజూచి గొప్ప నీవనుకోకు
మేడ మిద్దెజూచి మిడిసిపడకు
చెలువుమీర విరులు నిలుచునాకడదాక
గడ్డ2 కలియు, మీద గడ్డిమొలచు 301

మన్ను తొక్కుకొనుచు మిన్ను చూడగనేల
నిన్ను అదనుజూచి మన్నుకప్పు
మూడునాళ్లలోన ముగియు నీ జోరెంత
మట్టితిరుము నిజము మరువబోకు 302

ఆకు కొమ్మనుంచి అలవోకగారాలు
తిరిగి కొమ్మచేరు తీరులేదు
మళ్లి దొరకబోదు మానవజన్మంబు
చుక్కబెట్టుకొనుము జన్మఫలము 303

తనువు నిలువనపుడు తగులాట మేలోయి
నీకు సాధ్యమగునె నిలువరింప!
కోట్లుగలిగియున్న కొండలెక్కగలేవు
చిల్లిగవ్వకూడ చేరిరాదు 304

తరచిచూచినంత తనువొక సత్రమ్ము
మరలు గొలుపుచుండు మనసుకావు
కోర్కె మనసునందు కొసలుదేరునుగాని
కడకు మిగలడెవడు కాలమహిమ 305

సుఖములేదు రేయి సుఖములేదు పగలు
ఎండ, నీడ సుఖము నివ్వబోవు
నామమహిమవీడు నయగారికెన్నడూ
ఇలను సుఖములేదు, కలనులేదు 306

నిన్ను నీవు తెలిసి నినుగాచుకొనుటకై
నిదుర మేలుకొమ్ము నిముషమైన
ఘడియ ఘడియకెట్లు గడచునో బ్రతుకులు
అరయ సాధ్యమగునె నరునకెపుడు 307

తోట నాశ్రయించి తేటి వాసముసేయు
మధురయాత్రలోన మధువుగ్రోలు
తోటనాశ విడిచి తేటి ఎగిరిపోయె
వాటి చిన్నవోయె వాసిబోయె 308

భయములేక ఎదకు భావమ్ముగలుగదు
భయము ప్రేమభావ స్పర్శవేది
భీతి ఎదనువీడ రీతిరసముచచ్చు
భయమువిడకు భక్తి భాగ్యశాలి 309

అనుసరుచునుగాని ఆలోచనములేదు
గుమపులెక్కడున్న గొఱ్ఱెదాటె
మున్నునొకటి దూక నన్నియూదూకును
ధరణి మార్గమంతె! తలపులంతె! 310

అడుగులోనె పెద్ద మడుగుదాటెడి వాడు
కొండలన్ని పిండిగొట్టు వాడు
ధరణి నడుగుజేసి దానమడుగు వాడు
కాలగతిని దాటి నిలువగలడె! 311

తోటమాలి పూలు తుంచుటగనినంత
మొగ్గలడరుచుండె నిగ్గుచెదర
విచ్చియున్న పూవు విలపించె నేటికై
కోరకమ్ము ‘రేపు’ కొఱకునేడ్చె 312

కాలుచున్నవాడు, కాల్చువాడునుచచ్చు,
ఏడ్చువాడుచచ్చు ఎవడు నిలుచు?
ఎవరికేమిజెప్పి ఏమని మొరవెట్ట
<poem>