పుట:Snehageetalu.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

<poem>
చేయిదాటిపోవ చేయగల్గిన దేమి
తులువపొత్తు మొదటె తుంచవలను 285

ప్రభువు శ్రీయుతుండు పరిచారికుడ నేను
విభుని దారినెపుడు విడువబోను
అతడు గొట్టుగాక ఆదారి వదలను
చిత్తమప్పుడైన మొత్తబడదె? 286

దాసుడగును గాని దాస్యభావము రాదు
భావమందు నెనరు2 బారుచుండు
నీరులేక దప్పి నీకెట్లు దీరును
దాస్యమున్న ప్రేమతావి గలదె! 287

భుక్తి కోరబోను ముక్తియూ నడుగను
భక్తి దానమిమ్ము భాగ్యశాలి
ఏమిలేనినాకు నెంతయోనున్నట్లు
తలచుకొందునీదు తలపులుందు 288

కనులు మూయలేడు అనురక్తుడెన్నడూ
విరహయోగమందు వేగుచుండు
నీటబాసి చేప నిలుచునా క్షణమైన
ప్రేమయున్నచోట పేర్మి కలదు 289

ఎదను స్మామియుండ ఎరుగనట్లుండుట
సాధ్యమగునె నీకు సాధకుండ
ఎచట దాచుకున్న ఎలమి1 నాపగలవు
అణువు అణువునిండి అజుడువెలగు 290

కట్టె వనిదైన కాబోదు శూన్యంబు
ప్రభువు తనకు తాను ప్రకటమవడు
అన్నియెదలలోన అణుకూపమున నుండు
వెడలుచోట తెలియు వేల్వుస్రులు 291

ఫాలమందు తత్త్వ కాలమ్ము దూర్చును
కర్ణములకు స్మృతులు ‘కమ్మ’లగును
చేత కంఠమందు ‘చేరు’2 గా ధరియించి
చావునంటి తిరుగు సాధువెపుడు 292

మనసు మాల వేసి తనువు మేఖలజుట్టి
భయవిభూతి దిద్దు ఫాలమందు
రూపుగట్టి విభుని రూపమ్ము దర్శించు
విదుడు వెలుగుచుండు విశ్వమందు 293

తనువు యోగియైన తరింప సాధ్యమా
మనసుయోగ మందు మసలవలయు
ప్రధిత యత్నమందు పరమాత్మదరిజేరు
యోగసిద్ధి దివ్యయోగ మిచ్చు 294

నూదు జుట్టుపట్టి నియతించు1 చున్నాడు
కాలుడహరహమ్ము! కల్లగాదు
ఎందుదాగియున్న నెటతిరుగుచున్న
కాలగతికి మార్పు గలుగబోదు 295

సుఖముగాని బ్రతుకు సుఖమని తలపోసి
మనసు మరియుచుండు మాయలోన
కాలమెప్పుడైన కాలుని సొంతమ్ము
నిలువ చోటులేదు నేలమీద 296

నూటిబుడుగ వంటి నీదేహమోహాన
కొట్టుకొనుచు నీవు కులకనేల
చూచుచుండెగానె చూపుకందదు మేను
వేగుచుక్క వోలె వెలసిపోవు 297

రాత్రులన్ని నిదుర ప్రాతమైసరిపోవు
దినము తిండికొఱుకె తిరుగులాడు
తరళ2 తుల్యమైన తగుజన్మ మంతయూ
గుడ్డి గవ్వకైన కూడదాయె 298

ఎపుడు బుద్ధిబుట్టు నపుడె తలచుకొమ్ము
విభుని స్మరణసేయ వేళయేల?
<poem>