పుట:Snehageetalu.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

<poem>
సజ్జనుండు నిలుపు సత్యవిభుతిలో
దుర్జనుండు పొరలి దూరుచుండు
మనిషి గ్రక్కు కూడు మరులతో దినుకుక్క
లోలుపత్వ మింతె! లోకమింతె 271

పాదరసము తాకి పరుసమ్ము తెల్లనౌ
తెల్లపసిడి విలువ తేలిపోవు
దురితమౌను బ్రతుకు దుర్మార్గ చెలిమితో
శిలలపడవ దరికి చేరగలదె? 272

గాలితిండి చుట్టె గంధపు వృక్షాన్ని
చేరరెవరు దాని చెంతకెపుడు
గరళమంటి యున్న నరుని దరికిరారు
మొదట నాత్మశుద్ధి ముదము నీకు 273

విషము విత్తి అందు ‘వేల్పుబువ్వ’ ను బోయ
లాభమేమి దాని లాలసే2 మి!
మదిని భావమేది మాటుగానుండునో
అట్టిగుణము విడిచి పెట్టలేరు 274

గుణములేని వటువుని గురువెమిచేయును
ప్రాజ్ఞుడుండి కూడ ఫలములేదు
వెదురునుందు చేరి సుధలుపలుకుగాని
శరమునాప గలదె శబ్దసక్తి 275

తాపసి దరిచేరి తవుడుతిన్ననుగాని
సుధతిదొరకు నామ సుధలు దొరకు
‘పలవ’ వెంటజేరి పాయసమ్ము తిన్న
బ్రతుకు రిత్తవోయి భందపడును 276

సుజనమైత్రి నిత్య సుమతైల సార్థక
చెలిమివోలె ఎపుడు నిలిచియుండు
అత్తరు వణిజుండు అత్తరివ్వక యున్న
తావి నిన్ను జేర్చు తమకమందు 277

‘మధుర’ మంచిదౌను, మంచిదే ‘ద్వారక’,
‘పూరి’ ధామమైన పుణ్య నెలవె
సాధు సంగమ్ము సమకూరినప్పుడే
ఎట్టి క్షేత్రమైన గట్టుజేర్చు 278

సాధు చయముజేరి సత్సంగములుచేయు
దినమె మంచిదినము తిరుగులేదు
భక్తిలేని రోజు పక్షివీడిన గూడు
ఫలములేదు ఇహముపరము గాదు 279

‘కోటికాల్వ’ నీరు తేటగా నున్ననూ
తాకనెవ్వడైన తడయుచుండు
గంగ జేరి ఎంత కలచినజలమైన
శిరముదాల్చు నదియె శివునిమహిమ 280

సత్యభూశణమ్ము నిత్యమంచెరిగియూ
దుర్జనుండు తానె దూరమగును
అట్టివాని పొందు ఎట్టిచో సరిగాదు
కలనుగాని వాని దలచరాదు 281

ప్రేమ పక్వమైన పిచ్చివాడు విదుడు
ప్రేమ పండినపుడే రాముడుండు
పచ్చిఆనగింజ పచనంబు చేసిన
తైలమెట్లు పైకి తేలగలదు 282

మగుడు3 మసిని దాకి మలినమంటిన గాని
పొడవు3 సబ్బుబెట్టి కడగవచ్చు
కష్టపడినగాని ఇష్టపడినగాని
కాకి హంసయగుట గాంచగలమె 283

చెడ్డ సంగమెపుడు చితిజేర్చు శకటమ్ము
మొగ్గ నంటియున్న మల్లుసుమ్ము
సూచి1 కదులగాక సుమముకే మోసమ్ము
చెలిమి పాత్రమెరిగి చేయవలయు 284

రేగుచెట్టు తనను బాగ చుట్టుకొనగ
ముప్పుగాంచదరటి ముందుగానె

<poem>