పుట:Snehageetalu.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

<poem>
కలసి ఏకరీతి కానుపించు 256

సాధునెడద శుక్తి, సాగరం రాముండు
బిందుఫలము3 పండుటయందు గనుము,
రామునెరగబోని రాలుగాయకెపుడు
దక్కు రాయిరప్ప మిక్కుటముగ 257

అల్పులున్న పెద్ద అంతఃపురముకన్న
సాధువుండు పర్ణశాల మేలు
పనికిరాని తుమ్మవనము పెంచుకటకన్న
ఒక్క మంచితులసిమొక్క మేలు 258

రామభద్రుకంటె రామనామము గొప్ప
నామమందు విభుడు నడచుచుండు
రాముడుండు సతము రామదాసునెడంద
తీరునరయు మీ కబీరుదాసు 259

స్వామిరాపశోభ సాకారదర్శన
మ్మభిలషించు హితుడ ఆత్రమేల
పరమహంస నీకు ప్రత్యక్షదైవమ్ము
సాధుసేవలోనె సాక్షి దక్కు 260

తెలిసి మార్ఖులైన తీర్థంకరుల దారి
చేరబోరు ఎట్టి వారలైన
బసముకలిగి గూడ బలహీనుడౌ వారి
సంస్కరింప నెట్లు సాధ్యమగును 261

పసిడి వంటివాడు అసలైన సాధువు
విరిగెనెన్ని మార్లు తిరిగి అతుకు
మట్టికుండబోలు మాయగానితొ మైత్రి
తిరిగి అతకబోదు విరిగెనేని 262

చదివినంతలోనె సాధించునది లేదు
కోమలమగు నెడద కూడవలయు
నీట నానినంత ఈటె మెత్తనగునె
ఎడద లలిదమైన బెడదలేదు 263

స్నేహమెంత పంచి సేవించినా మూర్ఖ
మనసు గతిని నీవు మార్చలేవు
చవిటినేల దున్ని సాగు చేయుటయన్న
సాధ్యమగునె ఎట్టి సైరికునకు? 264

భవమునందు చిక్కి ప్రాకులాడెడు వాడు
సాధుమైత్రి వలన చక్కబడును
శ్రీసుగంధమంటి శీతవృక్షము గూడ
పరిమళమ్ము గూర్చి వాసికెక్కు 265

కొంగబుద్ధిగలిగి దొంగజపముచేయు
హారితుండు బకము ననుసరించు
కాలపాశమందు కలగిపోయెడి కొంగ
మత్స్యమందలేదు, మర్మమిదియె 266

కావిరంగువలువ, గళము పూసలపేర్లు,
చేత తిరిగుమాల, చిరత చెక్క,
మోర తిలకమద్ది ఊరేగు నటునికి
మనసునంటు మకిల మాన్పగలవె 267

తలలు నునుపుజేసి తడిబట్ట జుట్టిన
చిత్తమదుపుజేయ చేతనగునె
భక్తి కుదరబోని రిక్తవేషపు జాణ
తనకుతాను మోస మనుభవించు 268

మరల మరల జుట్టు మంగలికిచ్చిన
అజుడు చిక్కుననుట కర్థమేమి
గొఱ్ఱ నెన్నిసార్లు గొరుగెదరున్నికై
శ్వేతదీవి దెసకు చేరగలదె 269

పుట్టమీద కొట్టి పొందు లాభమ్మేమి
పుట్ట నిన్ను కాటు వెట్టబోదు
సర్ప మదపుజేసి చాటించు నీశక్తి
ఫలిదమింతయైన ప్రాప్తమగును 270
<poem>