పుట:Snehageetalu.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

<poem>
అర్థమైనగాని అగవు1 లేదు
అంధుడంధుజేర అధ్వ మెవ్వడుజూపు
దారిజూపు వాడె దర్శకుండు 242

నీదుదొసగు దెల్పి నిలకడేమిటొ చెప్పు
శాస్త3 దొరకడేని శ్రవణమేల?
తిరిగి నీరుద్రావు తూరౌను బ్రతుకంత
అరసి ఎంచుకొనుము ఆఖ్యవరుని4 243

సజ్జనుండు మేఘసదృశ్యమై వర్షించు
పరహితార్థియగుచు పరిఢవిల్లు
తనదు స్పర్శనిచ్చి తాపమ్ము పోగొట్టు
పరులసేవలోనె పండిపోవు 244

సింహమెపుడు గుంపు చేరగాగనరాదు
హంస బారుగట్టుటరయబోము
రాళ్ళగుంపు లోన రత్నమొక్కటెయుండు
సారవంతుడెవని చేరబోడు 245

చందనమ్మురాదు సానువు1 లన్నింట
చిక్కదన్నిచోట్ల చినుకుపూస2
అట్లె సజ్జనుండు అరుదుగా లభియించు
అరయ గల్గినపుడె నతడు తెలియు 246

సాధువువనెడి పేరు సాధించుటే గొప్ప
పొడవు ఖర్జురంపు భూజమద్ది
ఎక్కగల్గు వాడె మెక్కగల్గు మధువు,
మధువు దొరకినపుడు మరలులేవు 247

ధనము చూడబోని ధార్మికుండెవ్వడో
చెలువ నంటబోని ‘స్థితు’ డెవండో
పరగునతని కాలిపాంశువై చరియింతు
సాధుసేవలోనె సకలమబ్బు 248

చెట్లు పండ్లుతినవు, చెలమత్రాగదు నీరు
ఇచ్చుటందె తనివి హెచ్చుపొందు
సజ్జనుండు తాను స్వార్ధమ్ము విడనాడి
పరులకిచ్చుటందె మురిసిపోవు 249

చేరవచ్చునట్టి పౌరుల మనసులో
భావమెట్టిదైన బాధలేదు
తాను ఆదరించి తన మదిన్ జోటిచ్చి
సాకువాడె భువుని సజ్జనుండు 250

రాత్రజలము కన్న, రజనీకరునికన్న
చైత్రపూర్ణిమ వెలిఛాయకన్న
చల్లదనములోన సజ్జనుండేమిన్న
సాధిమాటచలువ సాటిలేదు 251

కులముదలచిగాని, ఫలము వలనగాని,
జాతినెంచిగాని, స్థలముగాని,
వయసుజూచిగాని, వాసినెన్నయుగాని
చూడరాదు సుగుణ జాడనెపుడు 252

విద్యతోటి వెలుగు విజ్ఞానబలమును
నిత్యధార్మికతయు, సత్యస్థితియు
ప్రేమగలుగు బుద్ధి ప్రియమైనవాక్యులు
సాధునరయ మంచి సాధనములు 253

కోటి కొంచెగాండ్రు కూడియున్నను గాని
భేద బుద్ధి రాదు భిక్షకులకు
నాగుబాములెన్ని నలుమూలచుట్టినా
చలువబాయబోదు చందనమ్ము 254

సౌమనస్విచెంత సకటు లెందరున్న
నెలవుదాటిపోడు నియతివిడిచి
ఫలములూడి పడిన పర్ణముల్ రాలినా
విడువబోదు తోట విటప మెపుడు 255

మావితోడు జీడిమావిడి యున్నట్లు
సాధులందు సిద్ధచారులుండు
అమృతభావమునకు అహమునూ తోడుగా
<poem>