పుట:Snehageetalu.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

<poem>
విడుతునన్న నెవని విడువగలను.
పట్టు విడుపు మధ్య పరమాత్మను గ్రహించి
కొలుచుచుంటి నాత్మ నిలుపుకొంటి 199

అతిగ బలుకరాదు అతి మౌనమును గాదు
అతిగ ధనము నెవరు నంటరాదు
అతిగ ఎండ తగదు అతివృష్టియును గాదు
మితము సర్వనిధుల హితవు గాదె 200

హరిని పొందగోరి అనిసేయ గలవాడె
శూరుడగును సత్య వూరుడగును
అతడు ముక్కలైన ఆజి విడువబోడు
ఆత్మ యుద్ధభూమి అలుగు1 భక్తి 201

బంధములు బాసి బ్రతుకు ఆశవిడిచి
పోరునట్టి వాడె వీరుడగును
చావువెరవడతడు సమరమ్ము విడువడు
తర్పణమ్ముసేయు తనకు తానె 202

శిరము ధారవోసి శివుని పొందెడివాడు
అమిత భక్తుడగును, అమరుడగును
కత్తిరుంచినపుడె వత్తి వెల్గులు హెచ్చు
ధూరుడైనవాడె చేరు శివుని 203

వెతకువానికెపుడు వెఱువు కలుగుచుండు
మదిని క్రుంగదీయు మలికితమ్ము1
దైవముందుకొనెడి ధైర్యము నీకున్న
అరను2 విడిచి ముందు అడుగుబెట్టు 204

ఆయుధములు బట్టి అనిసేయువానిని
శూరుడనుట నాకు చోద్యమగును
మాయత్రెంచి విభుని మహిమంబు నేరుగుటే
శూర ధర్మమనెద, శూరుడనెద 205

పతిని గొల్చు సతికి పైరంగు పనియేమి
కూల్యకేమి తరుగు కుబ్జయైన
కోరి విభునుచేరు కొమ్మకీయిలలోన
కోటి జాణలైన సాటిరారు. 206

పతికి ఉపచరించు అతివ యేస్థితిలోను
పరుల దరికి జేర మరులు కొనదు
పస్తుసున్నగాని పరిగ ముట్టని యట్టి
సింగమునకు సాటి చెప్పనగును 207

కనులలోకి రమ్ము కవలాక్ష యొకసారి
కంటి పుటములార్పి గప్పివేతు
పరులచూడబోను, పరల చూడగనీను
సామి విరహమొకటె సంతసమ్ము 208

స్వాతిచినికు కొరకు సాగరమున శుక్తి
తపముసేయు, జలము తాకబోదు
విభునిగొల్చు ప్రణయ విధి విధానమదియె
స్వచ్ఛమగును ప్రేమసత్యమగును 209

దాహమెంతయైన దరిజేరనీయదు
చాతకమ్ము బానిజలమునెపుడు
నాదుమదికి చేరలేదు యేదైననూ
రామనామ తీర్ధ రసము తప్ప 210
చక్కనైనసామి మక్కువ ననుచేరె
పరులమదిని జేర్చ పాడియగునె
పరువునెరుగలేని పతితుడనేగాదు
పమరపురుష నాదు పరువునిలుపు 211

రంగమెక్కి పడతి రాగసుధనుజేరి
ఆడిపాడి ప్రియుని వేడుకొనును
చేతనమ్ము గసిగి చూకటి తెరవీడి
తైలమయ్యె కామతత్వ్తమచట 212

నీదు ధ్యానసిరులు నిలిచిపోయినపుడు
మల్లుడైనగాని చెల్లబోడు
సాధ్వియగునుగాక సౌభాగ్యమబ్బదు<poem>