పుట:Snehageetalu.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

<poem>
మనిషి ద్వంద్వనీతి మసులుచుండె
రెండు ముఖములున్న పండునా బ్రతుకెల్ల
పరిహసమ్ము గాక పరువుగలదె 185

వినెడివారు లేక విహరించు మాటలు
వాదమగును మాట భేదమగును
వక్త శ్రోత కలసి భక్తితో పలుకగా
స్వాదమగును, అనియె స్వామి వినును 186

సహజమైనదేది సహజము కానిదేది
ఎవరు చెప్పగలరు ఇట్టి నిజము
ఎద్ది ప్రభుని చూపు నద్ది సహజమంచు
చెప్పగలను! మెప్ప జెప్పగలను! 187

సతులు సుకులు పోయె సహజ వాసనలందు
ధనము పోయె, మరియు ఘనము పోయె
కామమంతరించి కారుణ్యముప్పొంగ
ఈశుడు, కవిదాసుడేకమయ్యె 188

తనకు తాను నేది తరుణమై దొరకునో
అదియె తృప్తినిచ్చు నమృతఘటము
అడిగి పొందినట్టి దదియెట్టి దైననూ
రక్తసదృశమ్ము రిక్తఫలము 189

అన్ని నీవెయనుట కాధారమివ్వవు
నీవె అణు వనుటయు నిజము కాదు
అన్ని మాకొసంగి కన్నులందోచని
నిన్ను తెలియుటెట్లొ నేర్పవైతి 190

అనుభవమ్ము తప్ప అన్యమేదైననూ
ప్రభువు జాడ తెలియబరచలేదు
ఉనికి చెప్పనేల ఉత్తవాదములేల
మౌన ముద్రకన్న మంచి లేదు 191

కలును నిన్ను చూచు కాని చెప్పలేవు
పొగడగలదు నాల్క పొడయలేదు
చెవులు వినునే గాని చెప్పలేవెన్నడూ
తెలియు నీవటంచు తెలుపుటెట్లు ? 192

వాదమందు దాగి పాషాణముండును
మాటలందు వెతలపాటు గలదు
మౌనముద్ర దాల్చి గానమ్ము సేయచో
పంకజాక్షుడుండు శంకలేదు 193

ఆకశమున దేలి అంబుధి మునిగినా,
భువనమండలమున భవనమున్న
లాభమేమి గలదు లాలసత్వము దప్ప
దాసుడెపుడొ రత్నధారుడయ్యె 194

ప్రాణమున్న తీపిపణముపై నాసక్తి
హరిని చేరుటెట్లు? ఆశగాక!
గురుడను కడలి దిగి గురుతుగా రాగల్గు
అనువుకాడె రత్నమంద గలడు 195

ఎట్టి చావు కొఱకు యెల్లలోకమ్ములు
అన్ని వేళలందు అడలుకొనునొ
అట్టి చావు నాకు ఆనందపూర్ణమ్ము
కలుగజేయు నిజము, కలనుగూడ 196


మృతుడు తనకు తాను మృత్యువును జయించు
ఇల్లు కాల్చినపుడె యిహము తెగును
వింతయగును గాని విపరీత మదిగాదు
చావు సాధగమున సాధనమ్ము 197

అతని పొందెననుట అవివేక మగు భ్రాంతి,
పొందలేదనుటయు పొల్లు మాట
పొందినదియు లేదు పోగొట్టుకొనలేదు
పుణ్యడాత్మ నందె పూర్ణుడగును 198

పట్టుకొందుమన్న పట్టుబడు నెవడు?<poem>