పుట:Snehageetalu.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

<poem>
విషముతాగి తాను ద్రావి విలయమ్ము తప్పించు
విభుడు ఈశ్వరుండు వింతగాదు 171

నీటి లోతు దలచి నిలుచుంటి తీరాన
జంకు మనిషికెంత శత్రవగును
లోతు నరయ లేక లోకేశుడెటు దక్కు
ఒడ్డు నుండి నేను ఓడిపోతి 172

నిన్ను తెలియనెంచి నీకునై వెదకుచూ
తిరిగి నన్ను నేను తెలుసుకొంటి
బిందు వెప్పుడైన సింధువేయౌనను
సత్యమరయు గల్గి సాధునైతి 173

ఒకటి సర్వమందు నొకటిలో సర్వమ్ము
కలవటంచు బుధులు పలికినవారు
నేను జ్ఞానమందు నిజముగా కనిసితి
అందు మారులేదు అనువు1 తప్ప 174

ఎంత చదువు చదివి ఎన్ని వల్లించినా
సంశయంపు శూల చావలేదు
దుఃఖ కారణమ్ము దొరికె నేమోగాని
తొలుగుదారి నాకు తెలియలేదు 175

చీమ తుండముల చేరవేయుచునుండ
 కూడి పప్పుగింజ గోచరించె
 ‘అన్ని తనకె’ యనెడి అతియాశ ఫలమేమి
  ఏది యెవని ప్రాప్తమేది హితము 176

సత్యమెప్పుడైన చాల చేదుగుండు
కల్ల ఎవరికైన కమ్మనగును
మాయ నిలిచిపోయె మంచి మిగులదాయె
రాముడుండ గలడె రాళ్ళలోన 177

మాటజెప్పుటెంత మధురమై యొప్పును
చేతలందె దాని చేదు తెలియు
గుళిక చెదులోనె గుణము దాగినటుల
కర్మయోగమందు ధర్మముండు 178

నీరు చుక్కలేదు నీ వెంత వెదికినా
పాలనివ్వజూతు పరులకూవు
నిశ్చలమ్ము లేని నీ బుద్ధి వెచ్చించి
పరుల నుద్దరింప పాడియగునె 179

ఒట్టి మాటలందు ఒనగాడు ఫలమేమి
చేతలందు మేలు చేయగలవు
నిష్టగలుగు కర్మ కష్టాన్ని గడతేర్చు
కాపురమ్ము గడచు, కడలి దాటు 180

పదము పాడుకొనుచు పథము మరువకోయి
సాధనమ్ము విడచి సాగగలేవు
చేదియున్న నీరు చేదుగా కనిపించు
చేదు కొనుట నీకు చేతకాదు 181

పలుకు పలుకు గూర్చి పదము ల్లలిన గాని
అందు సార మేది పొందలేవు
మోహసలిలమంత వాహినియై పారు
నీదు అడుగులందు నిలువ లేవు 182

నడచి పోవు వాడు తబడ్డ తప్పేమి?
తావు కదలలేక దక్కు నేది?
నీవు కదలకుండ నిడివి లెక్కలు వేయ
పనికి చేటుగాక ఫలితమేమి? 183

వక్తలెక్కడైన శక్తి గలియుండు
వినెడివారు లేరు విశ్వమందు
మాటసారమరయ మాధుర్యమబ్బును
వాణి తెలియ విభుని వార్త తెలియు 184

మాటతీరు యొకటి మనసు మర్మమొకటి<poem>