పుట:Snehageetalu.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

<poem>
వన్నెవాసి కలిగి వజ్రమగును
ఎదురు దెబ్బకోర్చి ఎత్తు కెదగినపుడె
మనిషి శక్తి వెలిగి మాన్యుడగును 157

హంస కొంగ కలిసి ఆకాశ మార్గాన
‘మానసరసి’ చేరు మరులు తోడ
ఒకటి ముత్యమంటు నొకటి మత్స్యమునంటు
ఏది కోరువాని కదియె దొరుకు 158

ఎఱుకగల్గు చోట ఎఱ్ఱ చందనమౌను
గుఱుతులేక మోదుకుజమనండ్రు
కాలినపుడె దాని కమ్మని గంధమ్ము
తెలియగలదు శక్తి తేలగలదు 159

స్పర్శ దూపమౌచు సారమ్ము1 వెలిగించు
లోకయాత్ర కాలలోహ మగును
నామ దీపమందు ధీమతమ్మది ఎంత?
 ఎట్టి బంధమైన నెదురురాదు 160

 కోటగట్టినాను కాటుక గదియించి
అందు నిలుపుకొంటి నమృకమయుని
ఎందు దాచుకొన్న నెక్కడ తానున్న
రామనంట గలుగు రంగు గలదె! 161

రాళ్ళలేన దాగి రత్నమ్ము నెలకొన్న
ప్రజలు దాని జాడ పట్టలేరు
శోధకుండు రత్నసూక్ష్మమ్ము గ్రహియించి
వెలికి తెచ్చి దాని వెలుగు చూపు 162

పరులు చిత్తమెరిగి పరిశోధనలు చేయు
శోధకుండు నాకు బోధగురువు
చిత్త మరయు గల్గు సత్తయున్న స్ధిరుడె
శివుని గాంచగలడు భవనమునందు 163

సురభిజింక మర్మ మరయలేడా రాము
డిట్లు చేయనేల ఎరిగి యెరిగి
రాపునందె జాతి రత్నకాంతి తెలియు
సాక్షి ఎరుగలేని చాటుగలదె 164

సజ్జనుండు రత్నసాధకుండన చెల్లు
రాముడొక్కడె యిల రత్నహితుడు
రామరత్న మహిమ రాజశీలుడెరుంగు
ఇతరు లెరుగ నేరరెంతకైన 165

మన్ను కప్పి యున్న మాణిక్యమును జూచి
మూర్ఖుడెవ్వడైన ముట్టుకొనునె?
రత్నమరయుగల్గు రసవేది గ్రహింయించు
మన్నుతొలిచి జ్ఞానమణిని పొందు 166

కలియుగమునందు కర్మ తెలియు తప్ప
శబ్దసార మెరుగు శక్తిలేదు
ఏది హితవనుకొన అది విరోధమగును
కాలమహిమలోని జాలమిదియె 167

సాగరమ్ముబోలు సంసార జలధిలో
మునిగి తేలుచున్న యునికి జూచి
ఊబినుంచి లాగి ఉపదేశ మొనరించు
జ్ఞానమూర్తి ఎవరు కానరారు 168

లోకులందరెపుడు లోదాగు నగ్నిలో
కాలిపోవు చుండె కామతృష్ణ
నేను ప్రేమ నిడగ నిలుచు వా డెవ్వడు
నాకు పిచ్చి యంచు నవ్వువారె 169

ఎవరికొఱకు నేను ఇంత చింతించెదో
అట్టి విభుడు దొరకడాయె నాకు
తత్త్వ మెరిగిచూడ తానుండె నా వెంట
గుణములంట నట్టి గురుతు దొరకె 170

పాలుతాగి విషము ప్రసరించు నురగమ్ము
నీరుతాగి మనిషి క్షీరమిచ్చు<poem>