పుట:Snehageetalu.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

<poem>
లోకమంత నీవు లోన నీవుండగా
చేసిన దొసగెట్లు చెరిపివేతు
ఎదుట తప్పుచేసి యేమని ప్రార్థింతు
సిగ్గు గల్గుచుండె చిద్విలాస 143

పుట్టినపుడు నేను పోకిరై యుంటి
పెరిగినట్టి తీరు వెరవు1 గాదు
దోషహరుడ వీపు దుఃఖ నాశకుజవు
చేయునిచ్చి దరిని జేర్చుకొనుము 144

అవగుణములు నావి అపరాధి నేగాను
ఆజ్ఞనీది నాది యనుభవమ్ము
శివుని ఆజ్ఞ లేక చీమకుట్టదు గదా!
లజ్జపడగ నింక లాభమేమి? 145

అడ్డమెందరున్న అనుబంధమును నెంచి
ప్రేమ పంచవయ్య రామచంద్ర
కొలుచు వారికేమి కొదువనీకగునయ్య
నీకు కోట్లమంది! నాకు నీవె! 146

అంతరాత్మ గమన! ఆధారమే నీవు
నిన్ను మించి వేరు నెమ్మి నెరుగ
నీవు చేయి వీడ నిలుచునా నాజన్మ
ఏరుదాట జేయు యేడుగడవు 147

నేను నిన్నుజూడ నీ చిత్త మెక్కడో
ఒక్క మనసుకిన్ని దిక్కులేల?
నిజమునరయు రామ , నీవెక్కడుందువో
అన్యులెరుగ గలరె ఆదిదేవ! 148

ప్రేమ తెలియలేని పిచ్చివాడను నేను
తనువునంది చక్కదనము లేదు
మరులు పొందగలగు మర్మమైనను రాదు
భారమింత నీది! ఫలము నీది! 149

నాదు దేహమందు నాదైనదేదియూ
కానరాదు నూదిగాక దేవ!
నీదుసొమ్ము నిట్లు నీదరజేర్చంగ
బాధయేల నాకు భాగ్యశాలి 150

చేతకాడ వీవు చేయి పట్టుము రామ
ఎదురు చూచుచుంటి నెంతగానో
గతినిదలచి నన్ను గమ్యమ్ము చేర్చుము
పట్టి విడువరాదు పరమ పురుష 151

ప్రేమమీర ప్రియుడు పిలుచుచుండెను గాని
పిలుపునంద లేని పేద నేను
మలినమైన ధనముమాధవునికి నిచ్చి
శివుని అపరిశుద్ధు చేయనేల 152

ఊరు తెలియలేదు పేరు తెలియలేదు
నడచి నడచి యుగము గడచిపోయె
నాల్గు క్రోసులున్న నడవ గడవ లేక
నాధు జేరుటెట్లు సాధువైన 153

ఎన్నడైన గాని ఈశ్వరుంతలపవు
తలచ చోటు లేదు తలపునైన
ఎట్లు తెలియ నాతడెక్కడ నుండునో
దారిగానలేక చేరగలవె! 154

చీమలైనగాని చేర నేరని చోట
ఆవగింజ కెచట తావు లేదొ
అచట మనసునుంచి అజుని ప్రార్థించుచో
పరమపథము చేరు తెరవు దొరకు 155

నజచు మార్గమందె నడవడి వికసించు
దారులెన్నియైన ధర్మమొకటె
బాటసారి తప్పు, బాట తప్పుందుమా
దారి సాగునాడె తీరు తెలియు 156

సుత్తి దెబ్బ కోర్చి ఒత్తు కాగినపుడె
<poem>