పుట:Snehageetalu.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వానకోయిలగుచు వలపుపాటలు గట్టి
ప్రియుని ఆశ తోడ పిలుచుచుంటి 114

నిన్ను వెదకి వెదకి నినుజూడ తపియించి
నిర్మలాత్మ నిట్లు నిలిచినాడ
శ్వాస నిన్ను చేర నాసగొన్నది సామి
శాంతిలేదు ఎలమి కాంతిలేదు 115

కాలసర్ప మొకటి కాటువేసె తనువు
ఎట్టి మందుగాని పట్టలేదు
అదియె భక్తి విరహమనచు తెలిసెగాని
తీరు మార్గమేది తెలియదాయె 116

దర్శనమ్మునిమ్ము దరికిజేర్చుకొనుము
కానియడల మృత్యు కౌగిలిమ్ము
జాగరూకుడగుచు జాముగడపలేను
ఓపలేను దేవ తాపమింక 117

తనువు ప్రమిద, అందు తైలమ్ము రుధిరమ్ము
జీవవత్తి వేసి చెలువు మీర
ఆత్నవెలుగు నందు నరయ వేడుచునుంటి
ఎదురు చూడలేని ఎడదనాది 118

విరహినగుచు నిన్ను వీక్షింప వేచితి
కామమెంత చేదు రామరామ
కాయము బరువయ్యె కరుణించ రావయ్య
నామ మొకటి నిలిచె సామరూప. 119

నవ్వులయాటయందు నాధుండు దొరకడు
ఆర్తి లేనిచోట అజుడు లేడు
ఆటపాటతోటి అభవుండు దక్కిన
భాగ్యహీను లెవరు వసుధ మీద 120

పంజరమ్ము దక్కి పలలమ్ము1 చెయిజారె
కాకులెదురు జూచె కరుణ లేదు
ప్రభువు వచ్చునెపుడు భాగ్యమెపుడు పండు?
అంతరాత్మ బాధ నరయు నెవరు? 121

కనుల ప్రేమ నిలిచి కారుణ్యసిరి పొంగె
నీరు చుట్టుముట్టి నిండిపోయె
నీవు వచ్చి పిలువ నినుగాంచు టెట్లొకో
తెలియలేదు ప్రేమతెరల మధ్య 122

దేహసుఖము కోరి దేవులాడెడివాడు
పరమ ప్రియుని ఉనికి నరయలేడు
ప్రసవబాధ లేక పసివాని నీళ్లాడ
సాధ్యమగునె ఎట్టి సాధ్వికైన 123

పచ్చికొయ్య వోలె పరువంపు విరహిణి
పొలయుటెడద వేగి పొగనురాజు
విరహబాధ సడలి ప్రేమబాసిననాడు
ఎండుకట్టె వోలె మండిపోవు 124

కొండకోన తిరిగి కోయంచు పిలిచితి
ఏడ్చియేడ్చి కనులు పూడ్చుకొంటి
ఆయువంత తిరిగి ఆ0విరయ్యెనుగాని
హరిని చేరు మార్గ మరయనైతి 125

పుట్టె నెడదలోన పొగలేని దావాగ్ని
కాలిపోవుచుండె కాయమంత
వగచునెవని గుండె వానికే తెలియును
చూచువానికిదె చోద్యమగును 126

చెట్టుపుట్ట వెదకి చేలన్ని కలయాడి
అడవిపండ్లు నంజి ఆకుమెసవి
తరలివచ్చి రామదర్శనమ్మును భిక్ష
మరల కోరుచుంటి మరులుబోక 127

ఇష్టునరయ లేక కష్టమయ్యెనెడద
తల్లడిల్లు చోట తపముగలదె
పవలురేయిలేక పరితాపమందినా