పుట:Snehageetalu.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మనసు దిశల బట్టి మరలిపోవు
తనువునందు విభుని తలుపులే లేవాయె
రాముడేల కనికరమ్ము జూపు 100

స్మరణ ధ్యానమందు స్థిరముగా నున్నచో
మనసు నిలుచు, అందె మాటనిలుచు
తనువునిలిచు నందు తపమునూ స్థిరమౌను
తన్మయత్వ మొందు తనకు తానె 101

జపము చేయువాడు, తపము చేయని వాడు,
నాద భోగి మరియు నాదవిముఖి
అందరూ మరణము ననుభవింతురుగాని
శబ్ద స్మృతిని వీడ సాధ్యమగునె 102

ఆకలియను కుక్క అకటనవికట చేసి
భజన సాగనీదు సుజన మిత్ర!
ముక్క దానికొకటి ముందుగా పడవేసి
భక్తి భజన చేయ ముక్తి గలదు 103

నీవువీవటంచు నీవు నేనైపోతి
‘నేను’ విడచి నేడు నిలచి యుంటి
శూన్యమందు నామ సుధలు నింపుకొనగ
దిక్కులన్ని నీవు దిక్కు నీవు 104

నన్నుగూర్చి చింత నేనున్న ఫలమేమి
చింత బొంది ఏమి చేయగలను?
నన్నుగూర్చి శౌరి యెన్నగావలెగాని
స్వార్థ చింతనెపుడు వ్యర్థమవదె! 105

మూటగట్టనేల? మురిపెమందగనేల?
పొట్ట కోరునంతె గిట్టునోయి
ముందు వెలుక నీకు మురహరి కలడోయి
అడిగినప్పుడెల్ల అతడె యిచ్చు 106

తెల్లవారె నదియె వెల్లవెల్గుల సృష్టి
కోట్ల ప్రాణికోటి కూర్కు దూరె
ఇన్ని కోట్లమంది కెవరిచ్చె సరితిండి?
చింత నీదటన్న వింతగాదె? 107

అన్ని యిచ్చువాడు అతడేమి వ్రాయునో
తలలు బద్దలైన తప్పబోదు
ఎదియు నెవరికర్మ మదియె జరుగుచుండు
సంచితమును ఆశ మించనేల? 108

చాలినంత యిమ్మ జాస్తిగా నిడబోకు
ఋణము బంధనమ్ము గుణము1 గాదు
పరమహంస ఎపుడు బాకీన పడరాదు
బలము నీవు, దాని ఫలము నీవు 109

కుందవృక్ష2 మోయి అందమైన తనువు
ధనము వాసనగును మనసు తేటి
నామసుధల తడిసి నమ్మకమ్మును పండె
దారిదొరికె ఉనికి దరియు దొరకె 110

పాట పాడినంత పరమాత్మ దొరకడు
పాట యొకతె విభుని బడయబోదు
నమ్మకమున ప్రభువు నట్టింట నడయాడు
నమ్మకమును మించు నెమ్మి కలదె? 111

ప్రభువు నా విరహము పరిహరించు లెమ్ము
విరహమందు బాధ విభుడెరుంగు
చేప నీరులేక యేపగిది మనసు?
ప్రేమభక్తి సోని పెనువు గనుము. 112

ఎదురుజూచి చూచి ఎంతకూ గనరాక
కనులు మబ్బలగుచు కరిగిపోయె
పిలిచి పలిచి నాల్క పిడచగట్టెను గాని
ఫలము లేదు ప్రియుడు బలుకలేదు 113

కళ్ళు మరిగి కరిగి కాల్వ గట్టిన గాని
చెలుని జేరుదారి తెలియలేదు