పుట:Snehageetalu.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నీకు నాకు మధ్య నిండిన దూరమ్ము
లెక్కలేదు నాకు చక్కనయ్య
నింగి చంమామ నీటి కలువ ప్రేమ
అందదనుట విధికి నలవియగునె 86

సారసాక్ష నీదు దూరము నిజమైన
లేఖ వ్రాసుకొందు, లేమనౌదు !
తనువు మనసు నీదు తమకమ్ముతోనిండ
ఏమి వ్రాయవలనొ ఎరుగనైతి 87

అగ్నితాపమైన ననుభగవించవచ్చు
తాళవచ్చు ఖడ్గధారనైన
ఏకమైన చెలిమి నెట్లు నిభాయింతు
నీదు పొందులేక, నిజము సామి! 88

తత్త్వ మరయబోయి తామకాన పడబోకు
తర్కమేల నీకు తనువునిమ్ము,
శిరమునిమ్ముగాని చిత్తము నిడబోకు
నిబ్బరమున ప్రేమ నింపుకొనుము 89

సత్తుగాజు వంటి ఒత్తిడికోర్వని
పిరికివానియందు ప్రేమలేల?
ఒరపుకోర్చి నిల్చు సురభి1 హీరమ్ము2 లు
అట్టి విభునినెమ్మి యమృతమయము 90

నికష3 మొరసి బిట్టు నిలిచిన వానికే
సారశబ్ద వినికి4 సాధ్యమగును
అట్టిజాతి మాది అనుమాన మేలరా
అందు నీపుకూడ నడుగుబెట్టు 91

సర్మణ దుఖఃమందు సాధారణమ్మౌను
సుఖమునందు విభుని చూడడెవడు
సంతసమున గూడ సర్శేశు దలచిన
చింత దరికిరాదు చితినిచూడ 92

కామచారి ఎపుడు కవయస్మరణముమందె
నిలిచియుండు, విడువ నేరడెపుడు
అట్లె రాత్రిపవలు అంబుజాక్షుని చింత
మునిగితేలు వాడె ముక్తినొందు 93

హరిణ నాద హర్మ్యాన వసియించు
మనకి1 భారమైన మానబోదు
మనసు లయజేసి మధుసూధనుని దల్చి
తలపునందు నిలువ తరుగలేదు 94

నోరు మెదపరాదు నోము విడువరాదు
ఎడదలోని తలపు నెడయరాదు
వెలుపలి తెరనెపుజు వేసియుంచి, నిరత
మంతరంగమందు అజుని గొలువు 95

మాల త్రప్పుకొనుచు మన్వంతరము దాటె
మనసు తిరుగు దారి మారలేదు
చేతి పూస త్రిప్పి చేసేది లేదోయి
అంతరంగ భక్తి ఆత్మశక్తి 96

మనసునందు తిరుగు మాల ‘మనోమాల’
కోరి చేత తిప్పు కొయ్యదండ
చేతిసరము తిరుగ చిద్వలాసుడు దక్క
భాగ్యమెంత పొందు బావిగిలక 97

కొయ్యపూస జేసి కొలకు తీగను జుట్టి
ముడలు మెలికేసి మురియనేల?
మనసులోని మాల మనతొనె తిరుగాడు
శ్వాసలోనె కలసి వ్యాసమందు 98

సహజనాద సుధలు సౌందర్య రూపమై
అహరహమ్ము హృదయమందు మ్రోగు
స్మృతిని గలిసె సూక్ష్మధృతిగల్గు శబ్దమ్ము
వాదమేల వొట్టి వాక్కులేల! 99

చేత మాల తిరుగు, జిహ్వ నోట తిరుగు,