పుట:Snehageetalu.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సాధ్యమగునె ఎట్టి సాధుకైన 57

రాజు పేద లేదు, రక్తిశక్తియు గాదు
భక్తి నవ్వడైన బడయనోపు
మనసు నిల్వగల్గు మతిమంతుడౌ చాలు
భక్తికుదురు వాని భాగ్యగరిమ 58

నామస్మరణమందె రామసాధముండు
ప్రాణముండు వరకు ప్రణవముండు
ఉసురు గోలుపోయి ఊరేగునాడైన
ప్రాణధ్యాన వెరవు1 పదిలమగును 59

చింత తగులుకున్న చేజారదెన్నడూ
తెగునుగాక నాల్క తిరుగులేదు
నిప్పు మింగినట్టి నెలపులుగె పుడైన
బాధపడిన జాడ పట్టలేము 60

కన్ను మూసినపుడు కలలోనైననూ
మనసు ధ్యానమందె మసలవలయు
చితినిజేరు వరకు చింతబాయని వాని
క్షేమ మరయగలడు రామవిభుడు 61

నీవు నీవటంచు నీలోన గలసితి
నీవులేదేది నిజము గాదు
నీవులేక రామా ! నేనునూ లేనన్న!
సత్య మరసినాడ సర్వసాక్షి 62

అరయ ధనముగల్గు నద్బుద3 ఖర్వమ్ము4
రవియు సోకరవకు రాజ్యముండు
ఎంతయున్నగాని సుంత నీతోరాదు
భక్తిధనమె ధనము ముక్తిహితము 63

సకలకర్మలన్నీ సారమైనిలచితి తా
ధర్మబంధనముల దారిచూపు
నిండుభక్తి యెకడటె నిష్కామ కర్మమ్ము
బంధనములు తుంచి భక్తినిలుపు 64

బ్రతుకు నీకు వరము, భ్రమలు చేరగనీకు
బంధనములు పెంచి బాధపడకు
ప్రేమనిలయమిద్ది పిన్నమ్మ యిలుగాదు
బుద్ధి నదుపుజేసి శుద్ధి పొందు 65

తలపు నిండియున్న వెలపునేలబరచి
దానిపైననడచి దరికి జేరు
ప్రేమ జీవనునికె ప్రియుడు తా దొరకును
భక్తిలోని మర్మభావమిదియె 66

చెట్టుకాయగాదు సేద్యాన పండించ
సంతలోన దొరకు సరుకుగాదు
రాజు పేద భేద రాహిత్యభావమ్ము
నెదనుపెంచి ప్రేమ నెరుగవలయు 67

క్షణముహెచ్చి మరియు క్షణికమై క్షీణించు
భేదవర్తనమున ప్రేమరాదు
పంజరమున నిండి పరిపూర్ణ దీపమై
వెల్గుచుండు దివ్వె ప్రేమజ్యోతి 68

అహము కలుగునాడు అధ్యాపకుండుండె
నేడు అహము విడువ లేడుగురువు
చూడ ప్రేమ ఎంత సూక్ష్మమార్గమునుండె
ఇరుకుసందు నిద్దరిమడగలరె ! 69

ప్రేమలేని హృదయ మేమనంగగలము
రోదనమ్ము నొదవు రుద్రభూమి
ఉసురు1 లేక నెటులో ఊపిరాడుచునుండు
కొలిమితిత్తి వాని కలిమిమేను 70

కపటి చెంతనుండి కడుదవ్వు యోచించు
మాట చెప్పుకొకటి మర్మమొకటి
రాముడెక్కడున్న రాజిల్లు నా ఎద
రాచముంగిటున్న రామచిలుక 71

మనిషి మనిషికొక్క మతము వేరైయుండు
మతములెన్నియైన మార్గమొకటె
మనలులోని మాట మరుగులేక వచింతు
అనుభవమ్ము బహుళ మాత్మయొకటి 72

నిన్ను తలచి తలచి నేనెంత వేచినా
చూడలేదు, నీదు జాడలేదు
నామజపము నిండి నా మనస్సుండగా
నష్టమేమి, నాకు కష్టమేమి 73

మనసు నిండిపోయె మధురమౌ ప్రేమతో
దేహమంత రాగ దీపమాయె
పలుకులందు ప్రియుని పలకరించుటె గాదు
శ్వాస కూడ అదే ధ్యాస నుండె 74

రోమ రోమమందు రామనామముబల్కు
వలపు నిండినట్టి వసువపనందు
మాపు రేపులందు మరువనట్టి విభుడు
మనల విడిచిబెట్టి మాయమగునె 75

ప్రేమయెక్కవైపు ప్రీతి1 వరొకవైపు
ఎట్లునొక్క ఒరను యిమడగలవు
ప్రీతివిడిచి దైవప్రేమలో జీవించు
ప్రణయజీవినెపుడు ప్రభువు విడడు 76

గురునిబోధ వినచు గురుతు నెరుగు, అందు
కోర్కెలేదు లౌక్య కూర్మలేదు
కుండ కాలినతరి కుమ్మరి చక్రము
తిప్పనేల, దాని చొప్పదేల 77

అన్ని రసములందు మిన్న ప్రేమరలము
ప్రేమకన్నేది ప్రియముకాదు
ఒక్కబొట్టు మేన చిక్కితే చాలును
అన్ని తత్త్వశాఖ లభ్ర3 మగును 78

నామ రసమునందు ప్రేమ నిలిపినాను
ప్పియుని జూడ మదికి పిచ్చిబట్టె
ముక్తి యిమ్మటించు మొరబెట్ట నాకేల
ఏది యివ్వదగునో నెరుగడేమి? 79

అజుని చేరుటన్న అనాయాసము గాదు
చేరి ఎవరుగాని వేఱుగారు
అరులు గలుగవాని పరమాత్మ ఎరుగడే
విభుడు వానినేల విడిచిపెట్టు 80

అరులు కలిగినట్టి అనుబంధమే గొప్ప
ప్రేమనేలి పొందు పెద్దకెల్ల
కూర్మిలేక తనువు కూడియున్ననుగాని
ఫలములేదు ప్రేమబలము రాదు 81

కన్నులనెడి గదిని కనుపాప పాన్పుపై
కంటిరెప్ప తెరను కట్టియుంచి
విభును నిలుపుకొంటి వీక్షణమ్ములయందు
ఏల తొలగిపోవు లీలలైన 82

మరణమన్న భయము మరులందనీయదు
నిహతి1 సత్యమున్న నియతి తెలిసి
మరణభయము దక్కి మనగల్గు ధూరుడే
ప్రేమ పంచి విభుని ప్రియతనందు 83

హరిని ప్రేమమీర నారాధనొనరింప
ధనమునిచ్చు, కీర్తి ఘనమునిచ్చు
హరిజనులను గోరి ఆశ్రయించిననాడు
ఆదరమున దెచ్చి హరినియిచ్చు 84

తనువు కెంతదవ్వు దాగియున్ననుగాని
తరుగులేదు నాకు ధరణిధారి
కనులకందుకున్న కానిదేమున్నది
నాదు మదిని విడిచి నడువగలదె