పుట:Snehageetalu.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సాధ్యమగునె ఎట్టి సాధుకైన 57

రాజు పేద లేదు, రక్తిశక్తియు గాదు
భక్తి నవ్వడైన బడయనోపు
మనసు నిల్వగల్గు మతిమంతుడౌ చాలు
భక్తికుదురు వాని భాగ్యగరిమ 58

నామస్మరణమందె రామసాధముండు
ప్రాణముండు వరకు ప్రణవముండు
ఉసురు గోలుపోయి ఊరేగునాడైన
ప్రాణధ్యాన వెరపు పదిలమగును 59

చింత తగులుకున్న చేజారదెన్నడూ
తెగునుగాక నాల్క తిరుగలేదు
నిప్పు మింగినట్టి నెలపులుగె పుడైన
బాధపడిన జాడ పట్టలేము 60

కన్ను మూసినపుడు కలలోనననూ
మనసుధ్యానమందె మసలవలయు
చితినిజేరు వరకు చింతబాయని వాని
క్షేమ మరయుగలడు రామవిభుడు 61

నీవు నీవటంచు నీలోన గలసితి
నీవులేదేది నిజము గాదు
నీవులేక రామా ! నేనునూ లేనన్న !
సత్య మరసినాడ సర్వసాక్షి 62

అరయ ధనముగల్గు నద్బుద ఖర్వమ్ము
రవియు సోకరవకు రాజ్యముండు
ఎంతయున్నగాని సుంత నీతోరాదు
భక్తిధనమె ధనము ముక్తిహితము 63

సకలకర్మలన్నీ సారమైనిలచితి తా
ధర్మబంధనముల దారిచూపు
నిండుభక్తి యెకడటె నిష్కామ కర్మమ్ము
బంధనములు తుంచి భక్తినిలుపు 64

బ్రతుకు నీకు వరము భ్రమలు చేరగనీకు
బంధనములు పెంచి బాధపడకు
ప్రేమనిలయమిద్ది పిన్నమ్మయిలుగాదు
బుద్ది నదుపుజేసి శుద్ది పొందు 65

తలపు నిండియున్న వెలపునేలబరచి
దానిపైననడచి దరికి జేరు
ప్రేమ జీవనునికె ప్రియుడు తా దొరకును
భక్తిలోని మర్మభావమిదియె 66

చెట్టుకాయగాదు సేద్యాన పండించ
సంతలోన దొరకు సరుకుగాదు
రాజు పేద భేద రాహిత్యభావమ్ము
నెదనుపెంచి ప్రేమ నెరుగవలయు 67

క్షణముహెచ్చి మరియు క్షణికమై క్షీణించు
భేదవర్తనమున ప్రేమరాదు
పంజరమున నిండి పరిపూర్ణదీపమై
వెల్గుచుండ దివ్వె ప్రేమజ్యోతి 68

అహము కలుగువాడు అధ్యాపకుండుండె
నేడు అహము విడువ లేడుగురువు
చూడ ప్రేమ ఎంత సూక్ష్మమార్గమునుండె
ఇరుకుసందు నిద్దరిమడగలరె! 69

ప్రేమలేని హృదయ మేమనంగగలము
రోదనమ్ము నొదవు రుధ్రభూమి
ఉసురు లేక నెటులో ఊపిరాడుచునుండు
కొలిమితిత్తి వాని కలిమిమేను 70

కపటి చెంతనుండి కడుదువ్వు యోచించు
మాట చెప్పుకొకటి మర్మమొకటి
రాముడెక్కడున్న రాజిల్లు నా ఎద
రాచముంగిటున్న రామచిలుక 71