పుట:Snehageetalu.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చెప్పుకొనుట కదియు చేతకాదు
మూగవాడు తిన్న ముదురు బెల్లపుజూర
తెలియజేయలేని తీపి గురుతు 43

మూగవాని సైగ మూగకే తెలియును
జ్ఞానికి కెఱుకగల్గు జ్ఞానసుఖము
నాదువిభుని ప్రేమ నామది కెరుగాయే
అన్యమేది నాకు అంటుబోదు 44

జ్ఞాని మూర్ఖుడగును, జ్ఞానియౌ మూర్ఖుండు
రిక్తపూర్ణ భేద వ్యక్తమేది !
 అనుభనమ్మి చెప్పలనవి కానిదిసుమ్ము
అనుభవుంచుటొకటె ఆత్మసాక్షి 45

చేటవంటివాడు చిత్తు నెరుగు సాధు
మేలు పొందగలడు తాలు విడిచి
సారమెరుగువాడు దారులన్నిటి దాటు
తత్త్వసార సిద్ధి దైవసిద్ధి 46

గుణములెంచువాడు గుణహీనుడేయౌను
గుణములెరుగ విభుని గురుతుతెలియు
తేనె తీయదనము తెలిసి గ్రోలెడురీతి
అజుని పలుకుతూపి ఆత్మకెఱుక 47

సాధువైనందున సారము గ్రహియించు
చెడును సుంత చెంత చేరనీడు
హంస ప్రాలుగ్రోలి అంబువు1 విడనాడు
సత్యమందు నిలుచు సాధువెపుడు 48

అన్ని జూవులందు ఆదరమ్మును పంచి
సమత నేర్పువాడు సద్గురుండు
ఆత్మలన్ని యెకటె అభవుండు నొక్కడే
సత్యమరయుమోయి సామ్యదర్శి 49

లోకబంధనమ్ము శోకకారణమౌను
రాగమందు దాగి భోగముండు
తగిలియున్న గాఢతమము తెగిననాడె
ముక్తిగలుగు దాస భక్తిగలుగు 50

ధరణి యాకసమ్ము దవ్వెంతయుండునో
భక్తి వేషములకు బంధమంత
భక్తగలుగ గురువప పాదసేవ దొరకు
వేషమందు లౌక్య శోషదక్కు 51

కృతకభక్తి జూవభృతికి తోడ్పడునుగాని
ఆత్మ ఛాయనైన అంటబోదు
ఇరుకుబడ్డ పాము పొరను వీడినటుల
మోసకారి భక్తి మోయలేడు 52

పూర్ణజ్ఞానిగాక బోధకుండైననూ
భక్తి నెట్లుగాని బడయలేడు
ఎదయు తనియబోదు సదయుండుచిక్కడు
విద్యకృతకమైన వెలుగలేదు 53

దూసరములు సోకి కేసరమ్ము చెఱచు
కలుపు చేరి పంట కలిమి చెఱచు
సరసమెరుగక సభను చెఱచు వక్త
భావలాలసుండు భక్తి చెఱచు 54

ఆరువర్గతతుల కాస్పదమ్ముగునాడు
భక్తి చిక్కబోదు ముక్తిరాదు
జాతి వర్ణ భేద జాడ్యమ్ము విడినాడు
శూర్పూడెప్పుడైన చేరుశివుని 55

చేప నీరుకోరు శిశువు తల్లినికోరు
లోభి కాసునరయు లోకమందు
భక్తుడెపుడుకోరు భగవాను నామమ్ము
ప్రియము గల్గుచోట ప్రేమయుండు 56

నిరుపమాన భక్తి నిష్కామ ప్రేమతో
నిండి యెల్లవేళలుండ గలదు
కామమందు భక్తి ధామము చేరుట