పుట:Snehageetalu.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అణువు అణువునందు ఆనందరూపమై
వెలుగుచుండు నాదు విభునిరూపు
అతనికాంతి వెదకి అతనిలోలీనమై
వెలుగులందు చేరి వెలిగిపోతి 29

ఆకసమ్మునందు నమరెనొక్క సరసు
మనసుచేప నందు మసలుచుండు
సుధలు గురియుగాని సూత్రధారియెలేడు
అతని మార్గమెవ్వరరయ గలరు! 30

విభుని వెదకి వెదకి విశ్వమంత తిరిగి
కడకు ఆత్మనందె గాంచినాడ
విభునిగనిన పిదప విశ్వమ్ముముంగిటే
కోరకుండ తానె కొలువుదీరె 31

శివుని చేరి జీవి చేతనమ్మగునాడు
అంతులేని వెల్గులవతరించె
వెల్గులేకమైన విభవమ్ము ఎదలోన
సర్వసృష్టి సూత్రసారమిచ్చె 32

చిక్కె ధ్యానమందు చిత్తమాకాశమై
చేరదాయె తిరిగి చిత్తభ్రాంతి
నీటిగలియు ఉప్పు నీకెట్లు లభియించు
నిజము చెప్పుచోట ఋజువులేల 33

అహము విడిచి ప్రభుని ప్రసుర్తుడైనాను
అంతరంగమంత శాంతినిండె
అజునిచెంత సుంతనాదరమ్మది దక్క
ఆశలేల? నింకపాశమేల? 34

దైవ పంజరమున దరిచెరిరాముండు
ప్రదిత భక్తి భావ ప్రాపులోన,
హాయిగ నిదురించు అంతరంగ జ్యోత్స్న
పలుకులందు ప్రేమ కులుకులాడు 35

ఎన్ని రూపములను ఎంతెంతొ దర్శించి
భ్రమల బడితిగాని ఫలము లేదు
రామ దర్శమున కామమ్ము కడతేరె
సాటిలేని రత్నపేటి దొరికె 36

కారుమబ్బుగములు కప్పుకున్నవి మింట
మేఘగర్జనములు మెరుపు పంట
అందు కురియుచుండె నమృతంపుధారలు
తనివిదీర నేను తడియుచుంటి 37

వెలిగె జ్ఞానదీప్తి కలిగె బ్రహ్మస్ఫూర్తి
మానసరసి1 చేరు మార్గమొదవె
హంస2 మందు చేరి అన్వేషణము సేయు
3మౌక్తికమ్ముచిక్కె మరులు 4దక్కె 38

ఆత్మశూన్యమందు అల్లుకున్నది యిల్లు
అందు అమరనాద1 మమరి యుండె
లోకమేలేవాడు లోచనమ్ములకంద
దేహకాంతిమించి దీపమయ్యె 39

మానవుండుతాను మార్పు వాంఛించినా
బ్రహ్మరాతలయందె బ్రతుకగలడు
నీరు చల్లబరచి నీహారము 2గమార్చ
కరగి నీరమగుటె కడకు మిగులు 40

గురుని సాయమంది గుణములుదపుజేసి
దేహమందు నామ దీపముంచి
ప్రభువు దర్శనమును విభవ మనుభవింప
ఆపదలు తమంత అరచిచచ్చె 41

పగటి వేషములు పసువార్లు వేసినా
భ్రమలు మాయలేదు శ్రమలుతప్ప
ప్రభుని కరుణకేల ఫలితమ్ము రాబోదు
అతని చిత్తమందె అభయముండు 42

ఆత్మజ్ఞాన సుఖము నరయ తేలికగాదు