పుట:Snehageetalu.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నువ్వులందు నూనె నివ్వటిల్లినయట్లు
రాళ్లలోన చిచ్చు రగులునట్లు
నీదు ఘటము నందె నిలిచియుండు విభుడు
మేలుకొనుము ప్రభుని మేలుకొలుపు! 15

కంటియందు తార కలిగున్న రీతిగా
సర్వ ఘటములందు సాక్షియుండు
మూర్ఖు లెరుక లేక ముల్లోకము లొలయ
చిత్తమంట బోదు చెకుముకి శిల 16

తంత్రి లేని వీణ తనువునందున్నది
అణగి మ్రోగు చుండు నహరహము
నాదసాధన మ్మనాహత నాదమై
పరమపధము చేర్చు భ్రమలుబాపి 17

సారశబ్ద శృతులు సాదరమ్ముగవిన్న
కాకి హంస యగును కల్ల కాదు
శబ్దమందు జ్ఞాన సారమ్ము గ్రహియించు
బుద్ధజీవి జ్ఞానసిద్ధిబొందు 18

ఒకటి ఔషధియగు, నొకటి గాయపరచు,
ఒకటి బంధమిచ్చు, నొకటి తుంచు
పలుకు పలుకులోన ఫలితమ్ము వేరౌను
చెప్పలేము శబ్ధచిత్రగతులు 19

పలుకనేర్చువాని పలుకుల సరితూగు
ధనములేదు మించు ఘనము లేదు
పలుకులందు దివ్య ప్రభలు వెల్గుచునుండు
పలుకు దూచగలగు పసిడిగలదే 20

పరుసవేదివోలె పరమాత్మ నామమ్ము
స్పర్శతోనె దివ్య సౌఖ్యమిచ్చు
చిత్తక్షోభబాసి చిరుదివ్వె వెలిగించు
మోహబంధ వితతి నాహరించు 21

ఆదినామ మహిమ అసలైన మూలమ్ము
అన్ని మంత్రసిరులు అందుబుట్టె
నామ మహిమలేక నడచు జ్ఞానములేదు
నామకలిమి భువికి క్షేమమరయు 22

నామరత్న సిరులు ప్రేమకాస్పదమోయి
మాలకలిమి ఆర్తి మూటగట్టు
గానజపమునందు జ్ఞానదీపమువెల్గు
గాయకుండు తాను గ్రాహితాను 23

అన్ని రసములందు మిన్న నామరనము
ఎడము సేయలేవు, విడువలేవు
స్పర్శతోనె తనువు పరుసవేది యగును
నాదనామక్రియకు వేది యగును 24

నరుని హృదయమందు నామమ్మనంటెనా
పాపమంతరించి ఫలము దక్కు
ఎండుగడ్డిబడిన మండు సమిధివోలె
పొల్లు తొలగి ఇంత పుణ్యమబ్బు 25

కలనుయిలనుగాని కలవరింతనుగాని
తెలిసిగాని తనకు తెలువకైన
నామముచ్ఛరించు నరునకిదే నాదు
అజినమొలిచి చెప్పు నమరజేతు 26

రామనామ సుధల రమియించు చిత్తమ్మ
మాయనంట బోదు మార్గమందు
రాసమండలమును దూసుకొనుచుబోయి
చేతనాత్మ లోనె చేరిపోవు 27

సూత్రమొరిగిపోవు శూన్యమ్ము నసియించు
మనిషి మాయమగును మంత్రముడుగు
రామభక్తియొకటె రహియించు జగతిలో
సామమెరుగు వాడు రామమెఱుగు 28