పుట:Snehageetalu.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

{{
అక్షయపురుషుండు వృక్షమై వెలయగా
నిర్మలుండు కొమ్మ నియతి రెమ్మ
ముగురు మూర్తులు తరు మూలకేశమ్ములు
ఉనికి పత్రకమ్ము నూర్ధ్వ ముఖము 1
 
అతడె నాదు దైవ మతడె నా హితుడును
అతడె ప్రాణసఖుడు నతడె రేడు
అతడె సర్వమనగ నానంద ముప్పొంగు
అతని తోడు జీవి కమృత సిద్ధి 2

సూత్రధారి యతడు సుగతి రూపమతడు
సృష్టి మూలమతడు దృష్టి యతడు
స్మృతికి బోలు రూపధృతి లేని తేజస్వి
నేను గొల్చు నాదు నేస్త మతడు 3

నాల్గు భుజములుండు నయగారులను గొల్చి
తత్త్వ మరయలేరు సత్వమతులు
వేయి చేతులున్న వేల్పును పూజింతు
చావు పుట్టు లేని సత్య మతడు 4

రూపు లేనివాడు చూపు తానగువాడు
దేవదేవుడయ్యు దేహి కాడు.
లెక్కలేని వెల్గు లొక్కటై నడయాడు
గగనమంత తాను జగము తాను 5

సగుణసేవ తెలియ సద్గుణములు హెచ్చు
నిర్గుణాత్మ నరయ నిజము తెలియు
అన్ని మార్గ గముల నధిగమించెడి ధ్యాన
భజన విభుని దివ్య పథము చేర్చు 6

ఆవగింజనైన అచలమ్ముగా మార్చు
కొండనైన తృటిని పిండి జేయు
సర్వశక్తి యుతుడు సర్వేశుడొక్కడే
అతని చేయి బడని యణువు లేదు 7
}}
{{
గౌరవంబు తనది, గంభీరుడాతండు,
అఖిలసృష్టి యతని హస్తభూతి,
అణువునంటు తాను అఖిలమ్ము తానయ్యు
అతని చేరు గమ్య మరయగలనె 8

చేతలన్ని తనవి చేయించు నాతండు
శక్తి తనది కర్మయుక్తి తనది
కర్త యతడు మించి కర్తృత్వ మతనిది
అతడు లేని దేది అవని మీద 9

ప్రభువు చెంతచేరి ప్రణమిల్లు వానికి
చింతలేదు ఎట్టి శిక్షరాదు
ఎంద రొక్కటగుచు నెంత తలపడినా
వాని తలను పూవు వాడబోదు 10

శివుని త్రాసు నందు సిబ్బెలు కనరావు
దారమేది లేదు దండె లేదు
జగములన్ని తూచు జాగారి నా స్వామి
భేద మరయ లేని బేరగాడు 11

నీవు స్వామి గొలువ నిరుపమానమ్మైన
విలువ గలుగు అతని విలువ చేత
అతడు గానివాడు అతడు లేడు లేడనునాడు
నీటిగవ్వకైన సాటి రావు 12

జగతి వెదుక నేల! సుగతికై వగపేల
తావు పూవు నందు దాగినట్లు
నీవు వెదకు విభుడు నీయందె కలడోయి
భ్రాంతి తెరలు ద్రుంచు; బ్రహ్మమందు 13

మహిని తనువు కొక్క మతము వేరై యుండు
స్వామి కన్ని పనులు స్వానుభవమె
కోర్కె నెత్తి నుండ కొత్త మతము లేల
కాంక్ష విడువ స్వామి కరుణ దక్కు 14
}}