పుట:Sinhagiri-Vachanamulu.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

20

సింహగిరి వచనములు

నకుఁబోగా, శోభన ద్రవ్యాదులకు సుంకము పెట్టుమని సుంకరి నిర్బంధము చేయగా, (నేను) వారిద్దరి మాటలు విని దగ్గరకుఁబోయి, 'యోయి పుణ్యాత్మా, వేయికల్లలాడి యొక వివాహము చేయుమని రన్నను, నన్ను దుర్భాషలాడెను. ఆ సుంకరి తల (సెలగి) వధచేసి యావైష్ణవుని తిరుకల్యాణమున కంపిన ఫలము కలిగిన పుణ్యంబునను మీకు షోడశమహాదానంబులు చేసెదను. నాకుఁ బ్రాయశ్చిత్తము చేయుఁ డన్నను, నా బ్రాహ్మణులా చోరునియింటికి బోయి దానములు పట్టి ప్రాయశ్చిత్తముచేసిరి. అటువలె బ్రహ్మహత్యాది పాతకంబులు నాశనమాయెను. దేవా, ఇది మీ మహిమకాదా! మీ దాసుల కెవరికయిననేమి? తిరుకల్యాణము చేసినవారల కనంతములైన పుణ్యములు కలుగునయ్యా! ఇది పూర్వభాగవత సంకీర్తన. ఇందు యజుర్వేద సామవేద ఋగ్వేదాధర్వణ వేదము లున్నవయ్యా. ఇది మహారహస్యమే దేవా. ఇది మహాప్రమాణమే దేవా! శ్రీకృష్ణా! సింహగిరి నరహరీ నమో నమో దయానిధీ!

26

దేవా, ఆదిదేవుండవు, సకల బ్రహ్మాండ నాయకుండవు నీవని “ఏకో విష్ణుర్మహద్భూతం" బనిరే, దేవా, సమస్త విస్తారమూర్తి వని భావ మందెఱింగిన వారైరి, జాతివర్ణములతోఁ బనిలేదు. మీ భక్తుండైనఁ జాలునవి "శ్వపచో౽సి మహీపాల" అంటిరి. దేవా, సకలజీవులకు జతుర్వేదధర్మము లంటిరి. దేవా, ఆత్మజ్ఞానములేవి యాత్మలకు “ఆత్మజ్ఞానం జాయతే" యని తెలిపితిరి. దేవా, వేషధారణమే చాలదు. ఆత్మభక్తియే చాలదు. జ్ఞాన మాత్మభక్తి వంటిదని తెలిసి యందుకు "వేషాన్న విశ్వాసః ప్రజానామ్" అంటిరి. దేవా, బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రులందు పురుషసూక్తం బుండునని తెలిపితిరి. దేవా, కేవల జ్ఞానము తెలిసి, దూషణము కూడదని యందుకు దూషణయంటిరి. దేవా, మీ భక్తుండై యుండి రుద్రభక్తుల దూషించుట దోషంబని తెలిసి యందుకు “మద్భక్త శ్శంకరద్వేషీ. మద్ద్వేషీ శంకరప్రియః లావుభౌ పరోక్షం యాతః