పుట:Sinhagiri-Vachanamulu.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సింహగిరి వచనములు

21

యావచ్చంద్ర దివాకరౌ" అనియెడు వాక్యప్రమాణంబులు తెలిసి యందు కుచ్చారణ తారక వేషములకు శూద్రుండైనను జాలుసని "శూద్రాశ్చ భగవద్భక్తా విప్రా భాగవతాః స్మృతా" అంటిరి. దేవా, దూషకానుష్ఠాన దూషక రహితుం డుత్తముండు. నిరపేక్ష నిశాంతంబంటిరి, దేవా, సకలజగదంతర్యామివి సకలభూతాంతర్యామి వగుదువు. "సిద్ధం కేశవా, పురుషలోకేశమ్"అంటిరి. దేవా, మీ భక్తులు మిమ్మెచ్చటఁ గొనియాడుదురో యచ్చట (మీరు)వసించి యుందురని తెలిసెను. అందులకు “నాహం వసామి వైకుంఠే" అంటిరి. దేవా, మీ భక్తులు ఎక్కడ స్థిరమై వసించిన అక్కడ స్థిరమై యుందు రనుటకు "తులసీకాననంయత్ర" అంటిరే.[1] దేవా, “సదాచార్య కటాక్షేణ భజసిద్దిమ్". ఆచార్యులే నరహరి. (మీ) సాక్షాత్కార మెందున్న నందుల ప్రేమఁజూచిన బీజాక్షులు, సతులవలస ప్రేమఁజూచి రక్తమాంస క్రిమికీటక శల్యాదులఁ గానరు. ఇవియన్నియు నెఱింగిన మహాత్ములకు సర్వము హేయము. ఎఱుంగని తామసులకు సర్వము భోగము. అనాథపతీ, స్వామీ సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ.

27

దేవా, అకార ఉకార మకారములుం గూడఁగా ప్రణవము. ఇందు బీజాక్షరి గాయత్రి. ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తుల మహామహిమను నరుడెరుంగ వశమె? 'ఆనంతావై వేదాః' యని శ్రుతి పలుకుచున్నది. శాస్త్రములు లోకోపవాదములు. అడియేని దాసిన్ తొండండను శబ్దములు మీ దాసానుదాసులకు కారణమైనవి. మీపాదములాన, ఈ యర్థము తప్పదు. అనాథపతీ, స్వామీ, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!

28

దేవా, మీచరణయుగళ సేవకే కులజుండైననేమి? హృదయకమల కర్ణికా(ర) మధ్యమందు రత్నసింహాసనస్థునింగాఁ జేసి, పురుషసూక్త

  1. తులసి కాననం యత్ర, యత్ర పద్మవనానిచ, యత్ర భాగవతాస్సంతి తత్ర సన్నిహితోహరిః