పుట:Sinhagiri-Vachanamulu.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సింహగిరి వచనములు

19

ణోత్తము లేమనుచున్నారు. ‘వినుము చోరా, నీచేత దానము పట్టరాదు.మీకుఁ బ్రాయశ్చిత్తములేదు నీవు సహస్ర విప్రుల వధచేసినాడవు, నీచేత సప్తవర్షములనుండి రక్తమున దోగిన తుమ్మదుడ్డు మూఁడుశాఖలు మొలిచిన నీకుఁ బ్రాయశ్చిత్తము చేసెదము పొ’మ్మనిన, నా చోరుం డప్పు డాగ్రహముతో 'నరువదియేండ్ల బట్టి రక్తమున దోగినను తుమ్మదుడ్డునకు త్రిశాఖలు మొలుచునా' యని తన యింతిఁగూడి సంభాషించి తాను విప్రవధ చేయు నరణ్యమునకుఁ బోయె. దేవా, ఆ యరణ్యమందొక సుంకరి కలఁడు. అందొక శ్రీవైష్ణవుడు తన తిరుకల్యాణ మాప్రొద్దెయని లగ్నము నిశ్చయించుకొనిరాగా, నా సుంకరి 'శోభన ద్రవ్యాదులకు సుంకము వచ్చును,పెట్టిపొ'మ్మనిన, నా వైష్ణవుడప్పు డేమనుచున్నాఁడు,- 'ఓయీ, సుంకరీ, ఇంతకాలమునకు వివాహము గలిగినది. ఆలకిలి సేయకోయీ. నీకు పుణ్యమగును. లగ్నము తప్పిన వారాకన్యనీయరు.' అని మహాదైన్యపడినను, మఱియును బోనీయక ఆ సుంకరి నిర్బంధము సేయగాను, వారిద్దరి మాటలు విన్న చోరుండు దగ్గరకు వచ్చి, 'ఓయీ సుంకరీ, వేయికల్ల లాడి వాచాదుర్భాషలు పలికి యొక వివాహము చేయవలె'ననినను, 'నీవైష్ణవుని సుంకము పెట్టక పోనీయను. ఇందుకు నీకేమిపని? నీవే మెఱుంగుదువు? పొ'మ్మనిన, నాచోరుఁడు సుంకరితల సెలగి వధచేసి యూవైష్ణవుని తిరుకల్యాణమున కంపెను, అప్పుడు చేసినధర్మమున క్రితముచేసిన యధర్మములు పరిహృతమాయెను. దేవదుందుభులు మ్రోసెను. పుష్పంబులు గురిసెను. ఆ దుడ్డునకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిశాఖలై మొలిచిరి.ఆశాఖ లేమనుచున్నవి—— ఓం చక్రో చక్రః , ఓం అచక్రో చక్రః జితక్షితివై వేదానామ్:' అని ఋగ్వేదమందలి పలుకులు పలుకంగాఁ జూచియా చోరుండాశ్చర్యపడెను. ఆ సభనున్న బ్రాహ్మణ సమూహంబులును, తుమ్మదుడ్డుంజూచి, యాశాఖలు వేదము పలుకఁగా విని మహాశ్చర్యపడి, యోరి చోరుఁడా, నీవు సహస్ర విప్రవధ చేసినవాఁడవు. నీ కీపుణ్య మెందువలన కలిగె'నని యడిగినను, నాతఁ 'డయ్యా, షోడశమహాదానంబులు చేసినవాఁడఁగాను. విద్వహింసాపరుఁడను. ఒక వైష్ణవుఁడు తిరుకల్యాణము