పుట:Sinhagiri-Vachanamulu.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

18

సింహగిరి వచనములు

తాము స్థాపితముచేసిన గుడారుకొయ్య తిగిచి చూచినను, రాకున్నను, యోజనములోతు త్రవ్వి తిగిచి, ఖండించబోయినను, (దానిని) తాము కన్నులఁగానక, భ్రమించి, తమ గుడారమునకు వచ్చి యా దాసునితో నేమనుచున్నారు.— 'నీవు పరమాత్ముండవు. నీ హృదయమున నాతఁడున్నాడు. మేము పోయి గుడారు కంబము దిగిచినను, దానిని నారాయణుఁడు కూర్మరూపమున మోసియున్నాడు. నీవే మా యాచార్యుఁడ' వని దండము సమర్పించి కడకుఁ జనిరి. సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!

25

దేవా, ఒక బోరుండు బ్రాహ్మణుల కనేకహింసలు చేయుచుండెను. కొంతకాలమునకు జ్ఞానము వొడమి యాతఁడు బ్రాహ్మణసభకుఁ బోయి యనేకహింసలు చేసిన పాతకుండను. నాకు ప్రాయశ్చిత్తము జేయుఁ'డన్న బ్రాహ్మణు లేమనుచున్నారు.—— నీవు తొల్లి, దొమ్మిదినూట తొంబదితొమ్మిది విప్రవధలు చేసిన పాతకుండవు. నీకు ప్రాయశ్చిత్తము లేదు పొ’మ్మనిన చోరుఁ డప్పుడు మహోగ్రుండై మండి, గృహంబు వెలుపట నిలిచి తన (భార్యతో) నేమనుచున్నాఁడు.— ‘నేను విప్రవధఁ జేయు తుమ్మదుడ్డు తె' మ్మనిన నప్పుడా యింతి యేమనుచున్నది. 'నీవు నా పతివి. నేను నీ సతిని, దాన మెఱుఁగవు, ధర్మ మెఱుఁగవు. మనకు ప్రాయశ్చిత్తమెట్లు కలుగును? మన మిక హింసలు మాని గృహంబునం గల ధనద్రవ్యాదులు దానధర్మంబులు సేసి, మనము సప్తసంతానములఁ బడయుదము. ఆట్లుగాక ప్రాయశ్చిత్తము లే'దని యా యింతి హరుసించినను, చోరుం డంతే కానిమ్మని, 'నీవును, నేనును గూరుకొని బ్రాహ్మణసభయున్న స్థలమునకుఁ బోయి, యా బ్రాహ్మణు లేక్రమమున జెప్పిన నా క్రమమునఁ జేయుద’మని, యిద్దరును బ్రాహ్మణసభయున్న స్థలమునకుఁ బోయి దండంబు పెట్టి 'మే మనేక హింసలు చేసిన పాపాత్ములము, మాకుఁ బ్రాయశ్చిత్తముఁ జేయుఁడనిన నా బ్రాహ్మ