పుట:Sinhagiri-Vachanamulu.pdf/84

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

సింహగిరి వచనములు

15

గనుంగొని, ఓమహాత్ములారా, ఈ బాలునికి జాతకర్మాన్నప్రాశనచౌలోపనయనాదులైన బ్రాహ్మణకర్మములు చేయవలెనని కుప్వారు సన్నిధిని సకలముం జేసి, ఆత్మావై పుత్రనామాసి'యన్న శ్రుతి చాటంగాను, నావిధంబున దలంచి లౌకిక కర్మము లాచరించిరి. దేవా, యీ వ్యామోహ మేల కల్పించితివి? దేవా, యీ చాతుర్లక్ష గ్రంథము నేవిఘ్నము చేయక నీడేర్చుము. దేవా, యాచారంబెరుంగ, ఆనాచారంబుగాఁ దిరుగాడు చుండుదును. జ్ఞానములేని పంచేంద్రియ వ్యవహారిని. దేవా, మీ నామావళి నుచ్చరించు భాగవతులు ధన్యాత్ములు, సంయమీశస్వరూపులు. మూఢాత్ముం డైనను నిలిచి వినెనేని దేవా! దురితసమూహము లెల్లం దొలంగును. శాంతులైన మహాత్ములు వినిరేని సకల కోరికలు సిద్ధించును. సాలోక్యము కలుగును. ఏకచిత్తంబున వినువారు యమద్వారంబుఁ జూడక వైకుంఠంబు చేరుదురు. నమో నారాయణా, నీ ప్రభావంబున నీ పంచమవేదంబయిన యీ సంకీర్తనము నంతఃకరణంబున వినువారు సాయుజ్యంబు చేరుదురు. అనంతంబులు మీ నామంబులు. తెలిసియుఁ దెలియరావు, దేవా, 'ఓం, తచ్ఛమ్ యోరావృణీ మహే! గాతుమ్ యజ్ఞాయ! గాతుంయజ్ఞపతయే!' అని పురుషసూక్తంబున నభిషేకంబులు చేసి మిమ్ము గానలేరు. పురాణంబులు, శాస్త్రంబులు చదివిన నేమి? మీ గుణంబులు తెలియక, మీ దాసుండుగాక మిమ్ము గానలేఁడు, దేవా, జననీ జనకుండవు నీవే. కులగురుండవు నీవె. ఆచార్యుండవు నీవె. ఆప్తజనబాంధవా, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!

21

దేవా, మీరు జగదంతర్యాములై మీ గుణంబులు భూలోకంబునఁ బ్రసిద్ధిముఁ జేసితిరి. దేవా ఈ లోకంబున, శేషాచలంబున వేంకటనామధేయుండ వైతివి. ధనాపేక్షాపరుండవై విహరించితివి. భోగంబునకు పురుషోత్తముండవై జగత్తు(లకు) నాథుండవై మహాభోగంబు లారగించితివి. దేవా, లోకంబులోని ధర్మాధర్మంబులకుఁ బరమ భాగవతోత్తములపాలికి సింహాచలంబున నిలిచితిని. దేవా, భూలోకంబున వైకుంఠంబను నుభయ