Jump to content

పుట:Sinhagiri-Vachanamulu.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

14

సింహగిరి వచనములు

లెన్నుదురు. లౌకికు రెఱుఁగరు. అజ్ఞానులై రౌరవాది నరకమునుండి సంచరించుటయే దీనికి కారణము. నరహరీ. పావనుఁడైన యగ్నిదేవతను ముట్టినం గాలదే? ఆ యపచారము క్షమపెట్టినంగాని పాయదు. అఖిలాండకోటి సర్వము సర్వేశ్వరు మాయాకల్పితమేమి చేయుదును? నిరపరాధిని. జంతువు లఖిలాండ పూరితము లైనవి. జరామరణ వ్యాధులచేత నక్కటా యనుచున్నవి. ఈర్ష్యతగదు. (నైర్మల్యా)స్పదము లయిన యాత్మలందు గుణావగుణములు చింతించుట యవినీతి. సర్వభూత దయావ్యపగత రాగద్వేష మత్సర శమ దమాది గుణము లెన్నండు గలుగునో! స్వామీ, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!

19

దేవా, మీ పాదతులసియందుఁ జవినెఱిఁగినవా రమృతాది రుచులఁ దృణీకరింతురు. దేవా, మీ పాదయుగళ పరిమళ మెఱిఁగిన వారికి, చందన ఘనసార పరిమళము లసహ్యములు. దేవా, మీసౌందర్యము దర్శించిన కన్నుల కితరములైన రూపములు చూడఁ బాపములు. దేవా, మీ యసంఖ్యాక పరిమళ కథామృతము ఘనతరముగా గ్రోలిన జను లితర కథల నెరుంగరు. దేవా, సర్వగంధా, సకల బాంధవుండవై యిటువలె నిఖిలేంద్రియ భోగ్యమై రక్షింపవే. స్వామీ, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!

20

దేవా, అంతట నంధుడైన బాలుండు కులాధారుండాయెనని తన జననీజనకులు, తన బాంధవులును, గోత్రాదివరులును, సహోదరులును, పితృపితామహ ప్రపితామహులును జనుదెంచి యాశ్చర్యపడి కువ్వారుం జూచి యప్పుడిట్లనిరి. ఓ మహాత్మా! యీ బాలుని భవిష్యద్వర్తనంబు లెఱింగి రక్షించి దివ్యదృష్టి నొసంగి పరమభాగవతోత్తమునిగాఁ జేసితిరని యానందబాష్పములు గురియుచు, తమ కుమారుండగు కృష్ణమాచార్యుని కౌఁగిటఁ జేర్చికొని పునఃపునరాలింగనము జేసి, యచటనున్న మహాత్ముల