పుట:Sinhagiri-Vachanamulu.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

16

సింహగిరి వచనములు

కావేరీమధ్యంబునను, విభీషణవరదుండవై, శ్రీరంగశాయి వైతివి. ఈ విధంబున జగంబునఁ జతుర్విధ రూపంబులఁ దాల్చి విహరించు చున్నాఁడవు. మీ మహిమ పరబ్రహ్మమని తెలిసితిని. నాభయంబు లడంగెను. అనాథపతీ, స్వామీ, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!

22

దేవా, విశ్వంభరా, విశ్వపతీ, విశ్వమయా, విశ్వరూపా, విశ్వాత్మకా, విశ్వజనకా, శాశ్వతైశ్వర్యా, కలావతంసా, త్రిమూర్తీ, మత్స్య కచ్ఛప వరాహ నరమృగ విప్ర భూపతిరామ రామ కృష్ణ బౌద్ధతురగ సమారంభ సహస్ర లీలా విలాసా. అనంతనామా. స్తోత్రాతీతా. దైవదాసప్రియ ధర్మోపదేశా. నిర్మల తీర్థ స్వరూపా, దుర్మద దానవ విదారణా, భానుకోటి ప్రకాశా. పరమపదనివాసా, భాసుర సమ్మదప్రపూర్ణా. సకలభువనాద్యక్షా, నిత్యస్వరూపా. సత్యవాక్య స్థాపనాచార్యా, శరణు శరణు, సింహగిరి నరహరీ. నమో నమో దయానిధే!

23

దేవా, శ్రీమన్నారాయణా. పరబ్రహ్మ స్వరూపా. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా. వేదవేదాంతవేద్యా, చతుర్దశ భువనాధీశ్వరా, పురాణ పురుషోత్తమా. పుండరీకాక్షా, పురందరవంద్యా. సకల కళ్యాణ గుణోన్నతా. పక్షీంద్రవాహనా. శంఖ చక్ర గదా శార్జ్గ ఖడ్గాద్యనేక దివ్యాయుధధరా. మత్స్యకూర్మ వరాహ నారసింహ వామన పరశురామ శ్రీరామ రామకృష్ణ బుద్ధ కల్కి సర్వేశ్వరా. సర్వాంతర్యామీ. సకలభూతాత్మకా. సనామాంతకా. సంసారాంతకా. ప్రేతమస్తక ప్రతాపా. (?) చాణూర మల్ల యుద్ధకారీ. రాక్షసగిరి వజ్రాయుధా. కుక్కుటాసుర బకాసుర శకట ధేనుకాసుర విదళనా. భూతకీ ప్రాణాపహారా. శ్రీలక్ష్మీకుచ కుంకుమాంకితా, గోపీజనప్రియా, గోవర్ధనగిరిధరా, వేణునాదవినోదా, శిశుపాల శిరశ్చేదనా. కాళియ