పుట:Sinhagiri-Vachanamulu.pdf/82

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

సింహగిరి వచనములు

13

ఆనాథపతీ, స్వామీ, సింహగిరి నరహరీ, మీ కైంకర్యపరులకు వందనము చేయుటయే పదివేలు. అనంతములైన ఫలములు కలుగును. ఆచార్యహీనుండై ద్విజుండు కులాచారము విడిచి యునామకురాలి వలన సుఖమంది నట్టిదే, యితర దేవతాప్రపత్తి చేసినవారు, యతి రామానుజ మునివరము దాతారు, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!

16

దేవా, అనంతపద్మనాభ, వాసుదేవా, నారాయణా, గోవిందా, ముకుందా యనియెడు నిఱువది మూడక్షరము లెఱిఁగిన మహాత్ములు కలరొకో భూముపైని? సర్వాంతర్యామి సాక్షి యని శ్రుతి చాటుచున్నది. బ్రహ్మాండము మీ యందున్నది. 'ఏకో విష్ణుర్నారాయణః' అను నక్షరములు సహస్రముఖములై, చాటుచున్నవి. యతిరామానుజ మునివరము దాతారు, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!

17

దేవా, శ్రీరామానుజ సిద్ధాంతమును బోలు మఱి సిద్ధాంతము లేదు. పరమాచార్యులం బోలు మఱి యాచార్యులు లేరు. పరమ భాగవతులం బోలు మఱి సమ్మోదపరులు లేరు. వారి కైంకర్యపరులంబోలు మఱి కైంకర్యపరులు లేరు. "అస్మద్గురుభ్యోనమః" అను మంత్రమునకు సరి మఱి మంత్రంబు లేదు. పరమ రహస్యంబునుంటబోలు రహస్యంబు లేదు. పరమద్వయాధికారిఁబోలు మఱి యధికారిలేడు.పరమ నాంచారి బోలు మఱి జవని లేదు. ఆనాథపతి స్వామి నరహరిఁ బోలు మఱి దైవంబులేదు. స్వామీ, సింహగిరి నరహరీ, నమోనమో దయానిధీ!


18

దేవా, పరమ రహస్యకారియగు పురుషాకార ప్రసన్నుని ద్రష్ట