పుట:Sinhagiri-Vachanamulu.pdf/81

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

12

సింహగిరి వచనములు

14

దేవా, “ఆకాశాత్పతితమ్ తోయమ్, యథాగచ్ఛతిసాగరమ్' అందుల కపోహ యనియెడు జలంబు నంటియు నంటనటులుండవలెను. 'సర్వ దేవ నమస్కారః కేశవం ప్రతిగచ్ఛతి' అనియెడు స్మృతులుండగా దైవతాంతర మంత్రాంతర సాధకాంతర ప్రయోజనాంతరముల భజింపనేటికి? సంధ్యాంతమందే, దేవుని జపసమాధ్యానాత్మలోను బరతత్త్వము నింపి పరమ రహస్యమైన మార్గమున జగదీశ్వరునిం జేరి, జరామరణాదులకు లోను గాక జయమందరే? 'శివాయ విష్ణురూపాయ, శివరూపాయ విష్ణవే' అనియెడు స్మృతుల శివమనియెడు మంగళవ్రతములు శ్రీహరియందు సర్వపరిపూర్ణమై యుండగాను, ప్రకృతిం బొందక ప్రపన్నులైన పరమభాగవతులం గని, 'సర్వం విష్ణుమయం జగత్త'ని శ్రుతిస్మ్రుతులు మొర పెట్టుచున్నవి. 'నారాయణా ద్బ్రహ్మా జాయతే, నారాయణా ద్రుద్రో జాయతే' యని సర్వలోకరక్షకుఁడని, త్రిమూర్త్యాత్మకమని, సూత్రగుణధారి, యేకస్వరూపంబని, యేకైక స్థితి లయ కారణంబని, యేకమేవా ద్వితీయంబనియెడి వేదశాస్త్రపురాణంబులు సత్యస్వరూపంబులు నిలుపుచున్నవి. ఓ వేదోద్ధారా...............................[1] ఓంకార స్యరూపా, ఓ విశ్వరూపా, అజ్ఞానమనెడు నంధకారమును బాపి, జ్ఞానమనియెడు సులోచనములను ధరింపజేసి 'తద్విష్ణోః పరమంపదమ్మ'ను వారంలంగనుగొనఁ(జేయవే) శ్రీ రామానుజా, దాతారు, సింహగిరినరహరీ, నమో నమో దయానిధీ!

15

దేవా, మీ దివ్యజ్ఞాన మెఱుఁగువారు పరమజ్ఞానులు. పరమానందస్వరూపులు, వైకుంఠపుర నివాసులు. వారే పరమపావనులు.కోటి యజ్ఞకర్తలు. సర్వదర్శనంబుల, సకల శాస్రములఁ జదివిన ఫల మదియే.

  1. ఇచట నాలుగు పంక్తు లస్పష్టముగా నున్నవి.