పుట:Sinhagiri-Vachanamulu.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సింహగిరి వచనములు

వాహనరూండనై భరింతు నంటినా, గరుత్మంతుండు మీ సన్నిధినే యున్నాడే. దేవా, మీ పాదపద్మంబులు నా కన్నులఁ జూచుకొని మీ ద్వారంబు కాచుక యుండెద నంటినా, ద్వారపాలకులు మీ సన్నిధినే యున్నారే. దేవా, నేనా మిమ్ము నుతించగలవాఁడను! ఎనుబదినాలుగులక్షల కోట్ల జీవజంతువులలో నే నొక నర జీవుం డనే. దేవా, మిమ్ము వేయి శిరస్సులు, రెండువేల జిహ్వలుగల శేషాహి నుతియించి కొనియాడుకొనవలె నంతేగాక. యతిరామానుజా, అనాథపతీ, స్వామీ, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ.

6

దేవా, పరమపదవాసా, మీ నాభికమలంబున నాదిభీకర నారాయణ బ్రహ్మ జనించెనే. ఆదిభీకర నారాయణ బ్రహ్మకు కశ్యప బ్రహ్మ జనించెనే. దేవా, ఆ కశ్యప బ్రహ్మకు సూర్యుండు జన్మించెనే. దేవా, ఆ సూర్యునకు రఘువు జన్మించెనే. దేవా, ఆ రఘువునకుఁ గాకుత్సుండు జన్మించెనే. దేవా, ఆ కాకుత్సునకు మరీచి జన్మించెనే. దేవా, ఆ మరీచికి విశ్వమావు జన్మించెనే. దేవా, ఆ విశ్వమావునకు వికుక్షి జన్మించెనే. దేవా, ఆవికుక్షికి కుక్షి జన్మించెనే. దేవా, ఆ కుక్షికి భానుండు జనించేనే. దేవా, ఆ భానునకు ననూరుండు జన్మించెనే. దేవా, ఆ యనూరునికి త్రిశంకుండు జన్మించెనే. దేవా, ఆ త్రిశంకునకు హరిశ్చంద్రుండు జన్మించెనే. దేవా, ఆ హరిశ్చంద్రునకు లోహితుండు జన్మించెనే. దేవా, ఆ లోహితునకు సుదంతి జన్మించెనే. దేవా, ఆ సుదంతికి దుర్వాసుండు జన్మించెనే. దేవా, ఆ దుర్వాసునకు విదురుండు జన్మించెనే. దేవా, ఆ విదురునకు చదురుండు జన్మించెనే. దేవా, ఆ చదురునకు దిలీపుండు, నాతనికి నజుండు జన్మించెనే. దేవా, ఆ యజునకు దశరథుండు జన్మించెనే. దేవా, ఆ దశరథునకు శ్రీరఘునాయకులు జన్మించెనే. దేవా, యా రఘునాయకులకుఁ గుశలవులు జన్మించిరే. ఆ కుశలవులకుఁ గుంచభోజుండు[1] జన్మించెనే. దేవా, ఆ కుంచభోజునకు శ్రీ గోపాలుండు జన్మించెనే. దేవా, శ్రీగోపాలునకు నంద

  1. కుంతిభోజుండు ?