పుట:Sinhagiri-Vachanamulu.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సింహగిరి వచనములు

7

గోపాలుండు జన్మించెనే. దేవా, ఆ నందగోపాలునకు వసుదేవుండు జన్మించెనే. దేవా, ఆ వసుదేవునకు శ్రీకృష్ణుండు జన్మించెనే. దేవా, శ్రీకృష్ణునకు మన్మథుండు జన్మించెనే. దేవా, ఆ మన్మథునకు ననిరుద్ధుండు జన్మించెనే. దేవా, ఆ యనిరుద్ధునకు వ్రతముని జన్మించెనే. దేవా, వ్రతమునికి నీ లోకమున నుండు ప్రజలు జన్మించిరే. దేవా, ఈ సంకీర్తన వినువారలకు వైకుంఠ పదవు లిచ్చి రక్షింపవే. శ్రీకృష్ణ కువ్వారు స్వామి, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ.

7

దేవా, శ్రీమన్నారాయణా, పరబ్రహ్మస్వరూపా, అఖిలాండకోటిబ్రహ్మాండనాయకా, వేదవేదాంతవేద్యా, పురాణపురుషోత్తమా, పురందరవంద్యా, కపటనాటకసూత్రధారీ, మాయావినోదా, అగణితమహిమావతారా, సకలకళ్యాణగుణోన్నతా, సకలజగదంతర్యామీ, ఆశ్రితకల్పభూజా, శ్రీమదయోధ్యాపురవరాధీశ్వరా, దశరథరాజనందనా, కౌసల్యరత్నగర్భాకరా, సోమభువనతాగ్రజా[1] సౌమిత్రమిత్రా, శత్రుఘ్నవశీకరా, శరణాగతవజ్రపంజరా, కారుణ్యవారాన్నిధీ, భక్తిముక్తిఫలప్రదాయకా, శంఖచక్రగధాధరా, కోదండదీక్షాగురూ, తారాసేవితా, భక్తపరాదీనా, ఇక్ష్వాకుకులతిలకా, పక్షీంద్రవాహనా, దేవాదిదేవా, తాటకాప్రాణాపహారా, విశ్వామిత్ర యజ్ఞపరిపాలకా, యజ్ఞకర్తా, యజ్ఞస్వరూపా, యజ్ఞభోక్తా, “సర్వమ్ విష్ణుమయమ్ జగత్త'ను శ్రుతినికరపరివేష్టితా, అహల్యాశాపవిమోచనా, పురహరచాపఖండనా, సీతామనోహరా, పరశురామ బాహుబల పరాక్రమహరణా, అయోధ్యాప్రవేశా, కైకేయీ[విష్ను]కల్పిత పితృవాక్య సత్య ప్రతిపాలకా, చిత్రకూటాద్రి నిలయా, కాకాసురవిదళనా, దండకారణ్య ప్రవేశా, విరాధదైత్యహరణా, సుగ్రీవానుగ్రహా, మాల్యవంత ప్రవేశా, లవణాబ్ధి గర్వ హల్ల కల్లోలా, విభీషణ స్థాపనాచార్యా, దక్షిణ సింధురాజ బంధనా, సువేలాద్రి ప్రవేశా, రావణ సుగ్రీవ మల్లయుద్ధ వీక్షణ ప్రమోదా, మహోదర మహాపార్శ్వ కంపన వజ్రదంష్ట్ర

  1. భరతాగ్రజా