పుట:Sinhagiri-Vachanamulu.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

64


జరిగినతరువాతకాని ఒక నిర్ణయం - వీటిపై చెయ్యటం సాధ్యంకాదు. ఏమైనా ఇవీసింహగిరి వచనాలే. ఇవీ కృష్ణమాచార్య కర్తృకాలే అన్న ప్రత్యయంతో వీట్ని యథాతథంగానే ఇందులో రెండవ అనుబంధంగా చేర్చేను. సహృదయ విమర్శకులు వీటినిఆదరించి వివరాలు, విశేషాలూ వెలికితేవాలి.

సింహాచల దేవస్థానంవారు ఈ సింహగిరివచనాల ముద్రణ భారాన్ని, బాధ్యతను వహించటం ఎంతో ముదావహం. సింహాచలం వచ్చి కృష్ణమాచార్యులవారిపై ప్రసంగించి ఈ వచనాల ముద్రణకు దేవస్థానంవార్ని ప్రోత్సహించిన మాన్యులు, ఆచార్యమిత్రులు, శ్రీమాన్ కొర్లపాటి శ్రీరామమూర్తి, శ్రీమాన్ కులశేఖరరావుగారలకు ప్రణామాలు. వచనాల సేకరణలో పరిష్కరణలో ప్రూఫులు సరిచూడటంలో నాకు తోడ్పడిన నా రెండవ కుమారుడు చి. శ్రీనివాసరామానుజము(ఎం. ఏ., (సంస్కృతం: ఎం. ఏ., (తెలుగు);)నకు ఆశీస్సులు.

కృష్ణమాచార్యులవారిపై విశేష గౌరవాదరాలుకల నాకు ఈ అవకాశాన్ని కల్పించిన శ్రీ సింహాచల దేవస్థానం వారికి కృతజ్ఞత నివేదించు కొంటూ కృష్ణమాచార్యవాఙ్మయ పరిశోధనకు విశేషావకాశాలు కల్పించ గోరుతూ ప్రస్తుతానికి సెలవు తీసుకొంటున్నాను.

విభవ - ఆషాఢ - శుక్ల. ద్వాదశి.

శ్రీరామచంద్రాచార్య