పుట:Sinhagiri-Vachanamulu.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

63

రాలతో ఉద్దరింపబడినవి. ఇవి రెండూ ఒకదానికొకటి ప్రత్యంతరాలు.(3) R 447- B ప్రతిలో ఒక వచనమే ఉంది. అది తులసీమాహాత్మ్య ప్రతిపాదకం. దానిలో సింహగిరి ముద్రలేదు. అంచేత దాన్ని వదలి పై రెండు పుస్తకాలలోని వచనాలనే తీసుకున్నాను. పై ప్రతులలో మొత్తం 8 వచనాలున్నాయి. మొదటివచనం ముద్రిత ప్రతిలోని 34వ వచనానికి విస్తృత రూపం కావటంచేత దీన్ని గ్రహించలేదు. నాలుగవ వచనం ముద్రితప్రతిలోని 3వ వచనాన్ని కొంతవరకూ పోలిఉండటంవల్ల దీన్ని గ్రహించలేదు. ఆరవవచనం ముద్రిత ప్రతిలోని 40వ వచనంతోనూ, ఎనిమిదవ వచనం ముద్రిత ప్రతిలోని 7వ వచనంతోనూ సంవదిస్తూండటం వల్లా వీట్నీ తీసుకోలేదు. మొదటి అనుబంధంలో మొత్తం 4 వచనాలు చేర్చేను.ఇవి కృష్ణమాచార్య సంకీర్తనలే అనటంలో సందేహం అక్కరలేదు. వీట్ని ప్రస్తుతానికి యథాతథంగానే చూపించేసు. పరమపద వర్ణనాత్మకమైన వచనం, దశావతాన వృత్తాంత వచనం ఎంతగానో పరిశీలించి వివరణం వ్రాయవలసినవి. ఇందులో చివరవచనం శ్రీ ఆరుద్రగారు పేర్కొన్న వచనమే.

ఈ గ్రంధముద్రణం జరుగుతున్న సమయంలో యాదృచ్ఛికంగా కంట పడింది. "సింహగిరి నరహరి వచనములు" అన్న మరో లిఖితప్రతి. తిరుపతి ప్రాచ్యలిఖిత పుస్తకభాండాగారంలో ఉన్న దీవి ప్రతి వాల్తేరు ఆంధ్ర విశ్వకళాపరిషత్తు గ్రంథాలయంలో R1255 గా ఉంది. ఇందులో 43 వచనాలున్నాయి. వీటిలో ఆరువచనాలు 'దేవా' అన్న సంబోధనతో ప్రారంభం కావటంలేదు వచనాల చివర సింహగిరి ముద్రకూడా కొంచెం భిన్నంగానే ఉంది. 'నమోనమో దయానిధీ'— అన్నది వీటిలో లేదు. 'అనాధపతి'గా కాక సింహగిరీనరహరి వీటిలో “అనాదిపతి'గా గోచరిస్తాడు. చాతుర్లక్ష ప్రసంగం వీటిలోనూ ఉంది. కృష్ణ కువ్వారుస్వామి, యతివరులూ వీటిలోనూ ఉన్నారు. ఐతే ఈ వచనాలభాష కొంచెం సరళంగా మనకు దగ్గరగా కనబడుతుంది, ఇవి సింహగిరి నరహరివచనాలే. అందుకు సందేహం లేదు. వీని కర్త కూడా కృష్ణమాచార్యులే, ముద్రితవచనాల శైలితో కొంచెం విభేదిస్తున్నా మరికొన్ని వచనాలు ఇంకాబయటపడి అన్నిటిపై సమగ్రమైన పరిశోథనం