పుట:Sinhagiri-Vachanamulu.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10

వయసైనా ఉండి ఉండాలి. ఆయన తన పదహారోయేట పరాభవ సంవత్సర ఆషాఢ శుద్ధ ద్వాదశినాడు సంకీర్తనం ప్రారంభించేరు. ప్రతాపచరిత్ర ప్రకారం కృష్ణమాచార్యులు చాతుర్లక్ష గ్రంథం రాగి రేకుల మీద చెక్కించి వాట్ని బళ్ళకెత్తించి శ్రీరంగం తీసుకపోయేరు. ప్రతాపరుద్రుడి అవసానం 1323 కనక కనీసం 1320 లోగానై నాయీపని జరగాలి. శ్రీవెంకటరావు గారి ప్రకారం అప్పటికి ఈయన వయస్సు 30 ఏళ్ళు. ఆరోజుల్లో చాలా చిన్న వాడు. పదహారోయేట సంకీర్తనం ప్రారంభించినా కనీసం ఏభై అరవై ఏళ్ళు స్వామిని అనవరతంగా కీర్తించి చాతుర్ల క్షల మాట ఎలాగున్నా కొన్ని వేల కీర్తనలో వచనాలో ఆయన కూర్చి ఉంటారన్నది మాత్రం నిర్వివాదాంశం. పొతకమూరి భాగవతులతో ఆయన ప్రసంగించేటప్పుడు “కదమ 1.5 లక్షలూ ఎప్పటికపుతాయా" అనేదిగులు కూడా ఆయనలో కనబడుతుంది. దీన్ని బట్టి ఆది చాలా పెద్ద ప్రణాళిక గా కనబడుతుంది. కాని ఏటికి ముప్పై వేల గ్రంథం ప్రణాళికలా తోచదు. ముప్పైయేళ్ళకే అది పూర్త యేలాగుం టే ఆయన అంత దిగులుగా “ఎన్నటికి పూర్తవుతుందా" అని ఆందోళన పడవలసిన అవసరమూ కనబడదు. పొతకమూరి భాగవతులు కృష్ణమాచార్యులను సందర్శించే నాటికి ఆయనకు కొడుకు పుట్టటం, ఏడేళ్ళు జీవించి ఆ శిశువు పరమ పదించటం కూడా జరిగింది. ఆరోజుల్లో ఆష్టవర్ష కన్యకలకే వివాహం జరిగినా వరులు మాత్రం కనీసం త్రిదళులుగదా ! అందునా కృష్ణమాచార్యులు తనవారంతా కాదంటే మతంలో అనాథగా పెరిగి 'అనాధపతి' యేన సింహగిరి నరహరి కరుణవల్ల గొప్పవారయినవారు. ఈ గొప్పదనం ఒక రోజులో, ఒకయేడులో వచ్చేదిగాడు. 16 వ యేట సంకీర్తనం ప్రారంభించిన ఆయన కనీసం 10, 15 సంవత్సరాలు గడిస్తే కాని ఆమాత్రం పేరు ప్రతిష్ఠలు సంపాదించటం కాని, ఆయన మహత్వం కాస్త దేశవ్యాప్తం కావటం కాని జరిగే అవకాశం ఉండదు. అంచేత రమారమి పాతిక ముప్పది సంవత్సరాల వయస్సులో మేనమామ కూతురితో ఆయనకు వివాహంజరిగి ఉండవచ్చు. వివాహంనాటికే ఆయన భక్తి పారవశ్యంలో తల మున్కలౌతూండటం అంతరంగ' ప్రమాణసిద్ధం. వెంటనే పుత్రోదయం. ఏడేళ్ళు బ్రతికి ఆకొడుకు