పుట:Sinhagiri-Vachanamulu.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

9

కాలం

కృష్ణమాచార్యులు తమ వచనాల్లో 'వికృతి' సంత్సరంలో తాము జన్మించినట్లు చెప్పుకున్నారు. ఆయన ద్వితీయ ప్రతాపరుద్రుడివల్ల సమ్మానాలు పొందినట్లు ' ప్రతాప చరిత్ర సిద్ధేశ్వర చరిత్రలు, చెప్తున్నందువల్ల ద్వితీయ ప్రతాపరుద్రుడి సమకాలంలో ఉండే వికృతిని ఆయన జన్మసంవత్సరంగా భావించటం ఉచితం అన్న దృష్టితో కావచ్చును, కీ॥ శే౹౹ శ్రీనిడుదవోలు వేంకటరావుగారు కృష్ణ మాచార్యుల జన్మను క్రీ౹౹శ౹౹ 1290 వికృతిగా నిర్ణయంచేరు. కానీ డా౹౹ కుల శేఖరరావు గారు ప్రతాపరుద్రుడి పరిపాలనా కాలం 1295-1326 కనక 1290 ఆయన జన్మకాలం అయితే ప్రతాపరుద్రుడి నాటికి కృష్ణమాచార్యులు మరీచిన్న వయసులో ఉండవచ్చును అంచేత 1260_65 ఆయన జన్మకాలం అవటం బాగుంటుందనీ “మూజు వాణీ" తీర్మానం ఒకటి ప్రతిపాదించేరు. వారు ప్రతిపాదించిన కాలంలో 'వికృతి' సంవత్సరం లేదు. దీన్ని వారు పట్టించు కున్నట్టు కనబడదు. అయితే శ్రీ నిడుదవోలు వారి కాలాన్ని (1290) అంగీకరిస్తే శ్రీ కులశేఖరరావు గారి అభియోగం మాట ఏమిటన్న ప్రశ్న అల్లాగే ఉంటుంది.

అంతరంగ సాక్ష్యం

దీనికి సమాధానం కృష్ణమాచార్య వాజ్మయంలోని ఆంతరంగిక సాక్ష్యాలు, ఆయన కావ్యనిర్మాణ రంగస్థలం అయిన సింహాచలం, తాత్కల చరిత్ర, ఆనాటి శ్రీవైష్ణవ సంప్రదాయ ధోరణీ, ఇవన్నీ అనుశీలిస్తే కాని చెప్పటం కుదరదు. కృష్ణమాచార్యుల వేశ్యాలోలత్వం, శృంగార ప్రియత్వం ఆయన వచనాల వల్ల నే తెలుస్తోంది. ఇదొకటి ఆయన జీవితంలో గమ నించాల్సిన అంశం. అహోబలం నుంచి “నారసింహుని నాట్య వినోదులు” “పొతకమూరి భాగవతులు' సింహాచలం వచ్చి కృష్ణమాచార్యులను దర్శించు కొంటారు. అప్పటికి 'చాతుర్ల క్ష' గ్రంథంలో లక్షా ఏబది వేలు కొదవ కృష్ణమాచార్యులకు. 'చాతుర్ల క్ష' ఒకటి "యక్ష ప్రశ్న" లాగ విడవకుండా ఇంకా అలాగేఉంది. ఆది ఏమైనా వారు వచ్చేనాటికి కృష్ణమాచార్యులకు 40, 45 ఏళ్ళ