పుట:Sinhagiri-Vachanamulu.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

11

పోవటం. 40 ఏళ్ళలోగా ఇది జరిగి ఉంటే ఆ తరవాత 40, 45 మధ్య పొతకమూరి భాగవతులు ఆయన్ను సందర్శించటం జరిగి ఉండవచ్చు ఇక ఆయన వేశ్యాలోలత్వాన్ని గురించి. ఇందుకు ఆయనే సాక్షి. వివాహం అయి భార్యకాపురానికి వచ్చేకే ఈయన ఈ వ్యామోహంలో పడ్డట్టుకనపడుతుంది. ఆరోజుల్లో వేశ్యా లాంపట్యం అకార్యం, ఆవమాన్యం కాకపోగా మగటిమికి లక్షణం. కాని ఒక్క మాట, సమాజంలో ఏదోరకంగా అంతో ఇంతో వ్యక్తి త్వం మహత్వం సంపాదించుకొన్న తరవాతనే ఇట్లాంటివి చెల్లుబాటుకు వచ్చేవి. అంతేకాదురాణించేవిని. ఆనువంశికమూ పారంపరీణమూ అయిన పెట్టుబడివల్ల కాక, కృష్ణమాచార్యులు స్వార్జితమైన కీర్తి ప్రతిష్ఠల పెట్టుబడితోనే సమాజంలో సామాన్యమానవుడుగా నిలబడగల గటమేకాడు సామ్రాజ్యభోగాలనుభవించే స్థితికే వచ్చేరు. ఇంత స్థితికి వచ్చేకనే వారేంచేసినా లోకం ఆదర్శంగా ఆదరంగా చూస్తుంది. కృష్ణమాచార్యులకు ఈ స్థితికి రావటానికి ఆయన మనిషయేక, అంటే 16 ఏళ్ళ తరవాత కనీసం రెండు పదులేనా పట్టిఉండాలి. అంటే రమారమి 35 సంసత్సరాల వయస్సు వచ్చి ఉండి మంచినిండు జవ్వనంలో ఆచార్యులవారుండగా శృంగారవల్లభులయేరన్న మాట. దీనికి సంవాదిగా సింహాచలం చరిత్ర కనబడు తోంది.

శృంగారవాల్లభ్యం

ఆటపాటల్లో ఆందెలు వేయించుకున్న "దేవదాసీలు" దేవాలయాల్ని సేవించటం భారత దేశంలో సార్వత్రికం సామాన్యమూను. సింహాచలంలో 1264 నుంచి యీ సంప్రదాయం ప్రారంభం అయినట్లు శాసనాలు తెలుపుతున్నాయి 1266 లో గాంగ ప్రథమనరసింహ చక్రవర్తి దేవాలయానికి నూరుమంది పాటకత్తెలను సమకూర్చటమేకాక తత్సంప్రదాయ నిర్వహణకు ఒక వృత్తి కూడా ప్రసాదించాడు. వీరంతా సానులేకావచ్చునని చారిత్రకుల ఊహ.ఈ సందర్భంలో కృష్ణమాచార్యుల " దేవ వేశ్యా భుజంగా " అన్న సింహగిరి నరహరి సంభోధన అను సంధించు కోవటం ఎంతేనా అవసరం. ఈ ప్రకరణంతో కలుపుకొని చూస్తే దాన్లో ఆశ్చర్యం అక్కరలేదు. వీరు అందగత్తెలే కాక ఆట-పాటల్లోనూ ఆరి తేరినవారు. అప్పటికే కృష్ణమాచార్యులు పదకర్తగా సంకీర్తనా చార్యులుగా, మహామహిమాన్వి