పుట:Sinhagiri-Vachanamulu.pdf/142

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

సింహగిరి వచనములు

17

యతండు అరువది వేలేండ్లు నరకకూపంబున బడి పిశాచత్వమును బొంది అనేక వికారంబుల పొందు. నరహరీ! మీ నామసంకీర్తన నేర్చి చేసిననేమి, నేరక చేసిననేమి? నారాయణయను శబ్దమాత్రంబు దలంచినయతండే నిజదాసుండని అనేక స్మృతులు మొరయుచున్నవి. శ్రీకృష్ణకువ్వారు స్వామీ, సింహగిరి నరహరీ!

13

దేవా, గృహగతులైన ప్రపన్నులంగని వందనము చేయకుండుట, పురుషాకార ధర్మము విడుచుట, ఉపచరింపకుండుట, భగవద్వైభవము గొల్పడుట, గృహగతులైన మనోరథంబు నష్టి బొందుట, దేహాభిమానము విద్వేషించి యుండెనేని గృహగతులైన అనాదిపతి, సింహగిరి నరహరీ!

14

దేవా! శునకమునకు ఘృతము వోసిన, ఆ శునకము ఘృతపానము చేసి అదియింపుగాక మదియించినట్టువలె నధర్ములే మెరుంగుదురు? చిత్తధర్మస్వరూపులైన ధర్ములెరుంగుదురు గాక! అధర్ములే మేరుంగుదురు? ఇది పరతత్వంబని సింహగిరి నరహరి నామమెరింగి జరుగును..... గుదురు గాక! అజ్ఞానులెరుంగుదురే, దేవా!

15

15

దేవా! ఆచార్య పరమ భాగవత ప్రపన్నులైన వారి ఇతర దేవతాంతరంబులందగిన నరుండు దూషకనిందితుడైన కుమతికి స్వర్గతిలేదు. అది యెట్లనిన వినుడు—— తొల్లి భగవానుడు ద్వారపాలకులై జనియించి యున్న జయవిజయాదులు స్వామి చిత్తమునకు యెడయై అసురజన్మంబెత్తి శిశుపాల దంతవక్త్రులై , హిరణ్యాక్ష హిరణ్యకశిపులై, రావణకుంభకర్ణాదులై సమసిపోయిన విధమౌదురుగాన, సంభాషణ సేయవలదు. చేసినారేని వారున్ను హ........ బొందుదురు, అనుదినమును అగ్ని పైని ఆజ్యము