పుట:Sinhagiri-Vachanamulu.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

18

సింహగిరి వచనములు

చల్లిన అనలంబారునే? అధికంబౌగాక! వెనుతగిలి అవివేకిని బహుభంగుల బోధించిన మదిగొన........ దుండా గాక తాపజ్వరమునను శ్రీ గంధము పూసిన అప్పుడే మానునా? చరిగొని కాలుగాక. చెడ్డజ్ఞానికి శ్రీరంగేశ్వరు జూపిన దీవించనేర్చునచలమున నిర్భాగ్యుడౌగాక..... .యేదిగతి. అనాదిపతీ! సింహగిరి నరహరీ!

16

దేవా! తిరుమణి తిరుచూర్ణంబులు లేని యావిప్రుండు పతితుండు గాదా లోకము........లెవ్వడు. మీ.. .... గని విప్రులచె పంచమహాపాతకుండని వేదంబులు చెప్పుటగా విని భుజముల మీముద్రలు, లలాటమున తిరుమణి తిరుచూర్ణములై ని............గ్వుండుగాడు. ఇది యెరింగి యెరుంగకుండుట మిమ్మెరుంగకుండుట. ఇది సిద్ధాంతము. అది శాస్త్రసమ్మతము. పరమజ్ఞానము. మా రామా ..........నిది సమ్మతము. శ్రీకృష్ణకువ్వారు స్వామీ, సింహాగిరి నరహరీ! మీ దివ్యనామసంకీర్తనలు సమ్మతము.

17

దేవా! పూర్వజన్మ పురాకృత ఫలము జంతురాసులయందు లక్షలయందు విరించికైనం గడుపరాదు. కర్మఫలంబనుభవింపకపోరాదు. రజోగుణంబున బ్రహ్మాండంబు స్తుతియింపుచునుండి లోకమాతయైన పార్వతిం జూచి మోహించి తస్థలితుండైన అరిని శివు డాగ్రహించక రక్షించండే! అనాదిపతీ, సింహగిరి నరహరీ!

18

దేవా! దశరథరాజనందనుండవై జనియించి మహత్వంబు వహించి పరబ్రహ్మస్వరూపుండవుగా నెరవైతివి. దేవా, నీవు అయోధ్యాపట్టణంబును సహోదరులకు నీ జననీజనకులు చేసిన దోషంబు నీకు అనుభవింప గారణమని శత్రువులను జంపెనని కారణములు లేవు. దేహి మధ్యరంగంబున