పుట:Sinhagiri-Vachanamulu.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16

సింహగిరి వచనములు

పురాణకల్పమున నీయల్పదైవములు పుట్టె, మీ కరుణానిధి మీ సమ్మతి కాలచక్రములు కర్మములు ద్రుంచి హతాహతంబు చేసియు మీరే పరబ్రహ్మమని తెలిసి తెలియరు, అనాదిపతి సింహగిరి నరహరీ!

10

దేవా! నరహరీ! మీ చరణారవిందము సేవించెడి మనస్సు నాకెన్నడు కలుగును? నరహరి: మీ నామము దర్శించి చూడనున్నాను. నయనానందకరము నాకెన్నడు కలుగును? నరహరీ, నీ నామకథాగుణములు వీనులకు వినంగ జిత్తము పల్లవించెడి తలంపు నాకెన్నడు కలుగును? నరహారీ, మీ నగరి కైంకర్యపరుండనై అంజలి చేసుకొని నమోనారాయణా యను బుద్ది నా కెన్నడు కలుగును? నరహరీ, మీ దాసుల దాసుండనై యుండెడి చిత్తంబు గాని, అన్యచిత్తము లేకుండ జేయుమయ్య. నరహారీ! సింహగిరిపతీ! అకారణసుకృతివై యీ జంతువు నీ కరుణాంబుధి దేలించి మీ దాసులదాసునిగా కరుణ జూచి కరుణింపుమయా. సింహగిరి నరహరీ, మీ చరణములకు శరణు, శరణు.

11

దేవా! జలచర కీటకము (క్రియం) జరియించిన విధమున నా జన్మమెరుంగక తిరుగుచునుండగ, నీ మంత్రరహస్యమను జీవనము దొరుకుట వివేకింపగాను, లోహము పరుసము సోకి కాంచనంబైన విధమున ఏమో మీ భావ మెరుంగలేను. అవియె నాకు మీ గుణాంబుధి గొనియాడ గోచరంబై నది. చాతుర్లక్ష గ్రంథసంకీర్తన నుతియింపగనది యతిరామానుజ ముని..... అనాదిపతీ, శ్రీ కృష్ణకువ్వారు. స్వామీ, సింహగిరి నరహరీ!

12

నరహరి! మీ నామసంకీర్తన చేయుచుండగను యెవ్వరు రామనేమి ఇది హీనంబని అధికంబని యిది వర్ణము గాదని హాస్యంబు చేసిన