Jump to content

పుట:Sinhagiri-Vachanamulu.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సింహగిరి వచనములు

53

లెత్తి యోంకార రూపంబునఁ జరియించెడు గానఁ బుణ్యం బిది, పాపం బిది, యని యెఱుంగక జను లధోగతిం బడుచున్నారు. ఇందులకుఁ గర్తయు భోక్తయునైన పురుషోత్తమునికి విన్నపము చేయుదము, రండ'నుచు బ్రహ్మయు, శంకరుండును వైకుంఠంబునకుఁ జని, చక్రధారులును, ఫాలప్రదేశంబున తిరుమణి శ్రీచూర్ణములును జపమాలికాశోభితులైన పుణ్యులును, వేద శాస్త్ర పురాణ నామోచ్చారణంబులం బొదలెడు వారలును, శమదమాది గుణంబులఁ బ్రీతింబొందియున్న వారలును, విష్వక్సేన గరుడ జయ విజయ కుముద కుముదాక్షులును జేరి యుభయపార్శ్వంబుల సేవ చేసి విహరించుచున్న వైకుంఠపురంబు చేరిరి. శ్రీకృష్ణకువ్వారుస్వామి, దేవా, ఓంనమోనరహరీ, యనుచు పరంధాముని నగరివాకిటికిఁ జను దెంచి, నారదుఁడు వీణియ మీటి యాలాపనచేసి యాడుచుఁ బాడుచు నున్న సమయంబున నాదిశేషశయనుండై యుండి లక్ష్మిని జూచి యిట్లనియె, నాదాసులైన వారలు నన్ను బేర్కొనుచున్నారు. శ్రీవైష్ణవులను మన్నన చేయవలె. పోదమురమ్మ 'నుచు దేవ సంఘంబులున్న కడకు చనుదెంచెను. శ్రీకృష్ణకువ్వారు స్వామీ, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!

60

దేవా, ఒకపరి మిమ్ము నెఱుంగుదుమయ్యా. ఒక పరిమిమ్ము నెఱుంగమయ్యా, జ్ఞానిని చేయుమయ్యా. అజ్ఞానిని జేయకుమయ్యా. పుణ్యం బిది, పాపం బిది, స్వర్గం బిది,నరకం బిది, యాచారం బిది, యనాచారం బిది, నిషేధం బిది, యనిషేధం బిది, వావియు నిది, వరుసయు నిది, వర్తనం బిది, వివేకం బిది, యవివేకం బిదియని యనేక కర్మతంత్రంబులు ఘటించి యసంఖ్యజీవకోట్లం బుట్టింపుచు, పెరిగింపుచు, నణగింపుచు, బహుమాయల బహునాటకసూత్రధారివై యాశాపరుండవై, కులజుండవై, నిర్జీవుండవై, జీవంబులన్నియు నీవై, యేకమై, యనేకమై, యాకాశంబై, యనాకాశంబై, నిలకడయై, బయలై,