పుట:Sinhagiri-Vachanamulu.pdf/123

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

54

సింహగిరి వచనములు

వినోదించుచు, నింద్రజాల మహేంద్రజాల విద్యలం బచరింపుచు, పశుపక్షి నరమృగ క్రిమికీటక పిపీలికాదుల ప్రాణంబులు నీవై యున్న, నీ మహత్త్వము దెలియ బ్రహ్మ రుద్రాదులును, ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష శుక శౌనక భీష్మ దాల్భ్య రుక్మాంగద విభీషణాది పరమభాగవతులు మిమ్ము నుతియింపలేరు. మిమ్ము నుతియించ నేనెంతవాడను? అధమాధముఁడను, నరపశుఁడను, నీవు గాచి రక్షింపవే. ఆనాథపతీ, స్వామీ, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!

61

దేవా, ఆకలు యనియెడు తెవులింటింటికి దిప్పు. అసత్యకృతమే ముప్పు. తగవు. ధర్మము నడిపినదే యొప్పు. అనాథపతీ, నరహరీ, మిమ్ముఁ దలంపనిదే తప్పు, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!

62

దేవా, హిరణ్యనాభికమలంబునఁ దామసగుణంబుస సరస్వతీ(పతియు) నేనును (?) బుట్టితిమి, ఈ విధంబునఁ గారణకర్తలైన మా యందు విశ్వప్రపంచంబు పుట్టింపఁదలంచి, పంచశతకోటియోజన పరిమాణంబును, కోటియోజనంబుల యౌన్నత్యమునుం గలిగి హిరణ్యమయంబుగా నొక్క యండంబు గల్పించె. అయ్యండంబు బ్రహ్మాండం బనంబరగె, అం దాకాశంబు కల్పించె, ఆకాశంబువలన వాయువు, వాయువు వలన నగ్నియు, నగ్నివలన జలంబును, జలంబువలనఁ బంచమహాభూతంబులును గల్పించె. అందాకాశంబునకు శబ్దంబొకటి గుణంబయ్యె. వాయు తేజములను గుణద్వయంబు పుట్టె. తేజంబునకు శబ్దస్పర్శ రూపంబులను గుణత్రయంబు కల్పించె. జలంబువలన శబ్దస్పర్శ రూపరసంబులను నాలుగు గుణంబు లుద్బవించె. పృధ్వివలన శబ్ద స్పర్శ రూపరస గంధంబు