పుట:Sinhagiri-Vachanamulu.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

52

సింహగిరి వచనములు

గృహంబునకుఁ బనివినియెను. దేవా, నీ వాకారసుకృతివి. ఇది పూర్వ భాగసంకీర్తన (!) ఇది దానసంకీర్తన ఇది (?) పరమరహస్యము. శ్రీకృష్ణకువ్వారుస్వామీ, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!

58

దేవా, దినదినంబులు దుర్భాషలాడిన నాదు జిహ్వకు మీ దివ్యనామసంకీర్తనం బొకటి చాలదా? పంచమహాపాతకశతకోటి హతము చేయను, దూదికొండకు సహస్రభాగ మనలము చాలదా దహింప? శ్రీకృష్ణకువ్వారుస్వామీ, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!

59

దేవా, పరంజ్యోతిపరతత్త్వంబైన యాది నారాయణశ్రేష్ఠుండు లోకంబుల విహరించుచు నుత్పత్తిస్థితిలయంబులు సేయుచుండి యొకనాడు లక్ష్మీభూకాంత నీళలతో వినోదించుచుఁ, దారకబ్రహ్మంబైన రహస్యంబులు దెలుపుచు సుఖగోష్ఠిని వైకుంఠవాసుండై యున్న సమయంబున భూలోకంబున ధర్మాధర్మంబులు లేక ననేకజనులు దేవతానమస్కారంబు లుడిగి రాక్షసకృత్యంబులు గైకొని దుర్బలులై, వర్ణాశ్రమంబులు లేక చండాలగోష్ఠిం జరియించుచు, గోవధయు, విప్రవధయు ధనచోరత్వంబునను, మద్యపానంబులను, దెగించి శక్తిమయంబైన వివిధభంగుల విహరించుచున్న యాగడంబుజూచి, యింద్రుండును, దేవతాసమూహంబులను, యక్షులను, గంధర్వులను, పన్నగులను, వాసుకి (?) పుండరీక యాజ్ఞ్యవల్కులను, భరద్వాజ గౌతమ వశిష్ఠ గార్గ్య దీప్తిమంత నారదాదులైన మునిగణంబులఁ జూచి, 'యుగధర్మము విపరీతమాయెను. రక్షకుండును, శిక్షకుండును నైన పుండరీకాక్షుఁడున్న యెడకుఁ బోదము రమ్మ'నుచు, నజాండంబునకుఁ జని బ్రహ్మను గూర్చుకొని, కైలాసంబునకుఁ జని, శంకర ద్వారంబునకు వచ్చి కమలజుండు శంకరునితో నిట్లనియె. 'యుగయుగంబుల స్వామి యవతారంబు