పుట:Sinhagiri-Vachanamulu.pdf/112

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

సింహగిరి వచనములు

43

నిర్మల చరితుండవు. పారిజాతాపహార పరమపురుషుండవు. పరంజ్యోతి పరబ్రహ్మరుద్రాదులు మీపాద యుగళంబులు, కానంగలేని మాయాప్రకాశంబవై విహరింతువు. దేవా, కాశిలోన, తారకబ్రహ్మ రామమంత్రముల రుద్రుండు మిమ్ము నుతియింప దొడంగె. ఆకాశిలోన పార్వతీదేవి సహస్ర నామములొనర్చి భక్తిఁజిత్తమునఁజేర్చి గ్రక్కునమోదాటె.[1] ఓం రామ రామ రామ రామా, అనాద్యఖిలలోకారాధ్యా, నిత్యజగత్త్రాణా, నిత్య నిర్వాణా, సత్యవ్రతాధీశా, ఆత్మబంధుజనరక్షకా, పరమాత్మా, వినుము. తల్లివి తండ్రివి ధాతవు నీవు. భ్రాతవు నీవు. నీవంటి తేజోమణి నాకు గలుగంగా పాశబంధములూడెను. మోక్షసాధనంబులు మునిగణవర్గజాలంబుల కుపదేశించిన నుపనిషద్వాక్యంబుల మిమ్ము గానంగలేరు. మీకథ లెల్ల(?) మీ నయనంబులు. సూర్యచంద్రమండలంబులఁ బ్రకోశంబులై యుండును, మీ తిరుమేనిదీప్తుల, ఋషులు, ద్వాదశాదిత్యులు, నవబ్రహ్మలు, నేకాదశరుద్రులు,చతుర్దశ భువనంబులు, నింద్రాదిదేవతలు ననేకముఖంబులై యుందురు. దేవా, మీతిరుమేన గలిగిన దివిజులకు మాయ మహాముఖంబులై తోఁచు. దేవా, మీ మాయా దివ్య స్వరూపంబులై నట్టి తేజోమణి రవిప్రకాశంబున రవి నిద్రమేల్కనం దివిజులకు గనిపించె. మీమాయలుగానక దేవా, తిరుగుచుందురు. ఇంద్రాది దేవతలు తిరిగి మీయందు గలిగిరి. శ్రీకృష్ణాయని స్తోత్రము జేయఁగలిగిన మఱి తక్కిన దైవతంబుల మీదంగానరు. బ్రహ్మరుద్రాదులు మిమ్ము

వర్ణించలేరు. ఆనాథనాథాయని స్తోత్రంబు సేయ నీ జన్మంబుగలిగెను. మీ నామసంకీర్తనము వలన మిమ్ము గంటిని. మీ దాసులఁగంటిని. చాతుర్లక్షగ్రంథసంకీర్తనములలో నొక్కసంకీర్తన పలికినవారికి, పలికించినవారికి, విన్నవించినవారికి, లిఖించినవారికి సాలోక్య సామీప్య సారూప్య పదపు

  1. "మోదాటు" దీనియర్థము కాన్నించదు. "ముక్తిఁ జెందు" కావచ్చును.