44
సింహగిరి వచనములు
లిత్తురు. దేవా, మీరు నాకిచ్చిన వైకుంఠం బిత్తురు. మీయాస. మీచరణంబులాన. తప్పదు తప్పదు. సుకృతమే సాక్షి. అనాథపతీ, స్వామీ, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!
45
దేవా, నేను భూప్రదక్షిణంబు సేసి లోకములు సూచి, మాతా పితామహులకు పుణ్యక్షేత్రంబులఁ గృష్ణార్పణబుద్ధిగాను దానధర్మంబులు సేసి, శ్రీ యహోబిలమును, శ్రీరంగంబును, వేంకటాచలంబును, కాశీక్షేత్రంబును, ద్వారకంబును, నయోధ్యయును, శ్రీపురుషోత్తమమును జూచి, దేవా, మీ గృహంబున కరుగుదెంచిన కవాటంబులుమూయ మీకుఁదగునా? అజ్ఞానిని, యపరాధిని, సర్వేశ్వరా, నీవేతప్ప నితఃపరంబెఱుఁగననిన, గవాటంబులు దెఱచిన, స్వామి సన్నిధికింజని స్తోత్రంబు సేయందొడంగిన స్వామి ప్రత్యక్షమై, నీవు నా సన్నిధిని దాసుఁడవలెంగాక పొడగనవాయని యానతిచ్చిన, దేవా (నీవు) జననీజనకుండకు, దేవా, శిశువునంతటి తప్పుచేసినాను. తెగనాజ్ఞ చేయవచ్చునా యనిన స్వామి తిరోహితుం డాయెను. కృష్ణమాచార్యులు తన గృహంబునకుం బోయెను. కృష్ణ కువ్వారు స్వామీ, సింహగిరి నరహరీ నమో నమో దయానిధీ!
46
దేవా, మీదివ్యనామ సంకీర్తన మెవ్వండాయెనేమి, చేయగా విని యిది హీనము. ఇది హెచ్చు. వర్ణంబులుగావని నిషేధించినవారరువది వేలేండ్లు నరక గోళంబునుం బొందుచుండి యటమీద పిశాచత్వము బొందుచుందురు. దేవా, మీదివ్యనామ సంకీర్తనమెవ్వరు నుతియించిరి, వారెపో మీపరమభాగవతులు. వారెపో యనేక శ్రుతులు పలుకుచుందురు. దేవా, అభ్యసింపరానివి రెండు. ఆచార్య కటాక్షంబొకటి. అటుమీద (మీ) దాసుం డగుటొకటి. దేవా, బహుచింతా సంతతమై చరియించెడు వాయువువలెనే యొకమార్గమనక నీమనసు బహురతింబొందు. అనేక వికృతులం బొందు.