పుట:Sinhagiri-Vachanamulu.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

42

సింహగిరి వచనములు

అవ్యక్తా, అగణితగుణానందా, అమరేంద్రవంద్యా, అభయస్వరూపా, అఖిల బ్రహ్మాదిజనకా, విశ్వంభరా, విశ్వతోముఖా, శాశ్వతసచ్చిదానందా, ఏకరూపా, త్రయరూపా, పంచరూపా, అష్టరూపా, దశరూపా, శతరూపా, సహస్రరూపా, అక్షయలక్ష విచక్షణ ప్రమోదా, విచక్షణాలంకారా, నమో విభీషణ మోక్షకారణాయ. శ్రీకృష్ణ కువ్వారుస్వామీ, నమో నమో దయానిధీ!

43

దేవా, మీ దివ్యమంగళంబైన ద్వయతిరుమంత్రాచార్య కృపా కటాక్షములవలనఁ బుట్టిన మనుజుండు క్రితమున సుజనుండయిననేమి దుర్జనుండయిననేమి? అతండె మీదివ్యపదంబును బొందును. అదియెట్లన్నను, సకలలోహముల ఖండించెడు లోహమును, వేదశాస్త్రపురాణములు వ్రాసెడు లోహమును పరుసవేది సోకిన సువర్ణమైనట్లు పెద్దలైన ప్రపన్నుల మేదినీసురుల నాచార్యులఁ దల్లిదండ్రుల నవమానముజేసి తిరస్కారము లొనరించిన దుర్మార్గుండనంతకోటి బ్రహ్మకల్పంబులందు క్రిమికీటకాదుల సంగతి నొక్కఁడే చరించుచుండు. ఆదియెటులన్న వినుఁడు. తొల్లి యింద్ర(ద్యుమ్న?) మహరాజు మహాత్ముల తిరస్కార రూపంబునఁజేసి కుంజరయోనియందు జనియించి మహాకుటిలపడి మఱియెట్లు ఖర (మకర) వంశంబున ముక్తుండాయెను. ఇది మీరెఱుఁగరా? సకలజగద్విదితము. శ్రీకృష్ణ కువ్వారుస్వామీ. సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!

44

దేవా, మీ ముారవిందంబున వెలసిన బ్రహ్మ లోకాధి(కార)పరుండై యనంతకోటి వేదశాస్త్ర, పురాణేతిహాస వర్ణంబులు వర్ణించి యూహించి యనేకయిడుములఁ బొరలుచుండె. మీమాయ దలంప నెవ్వరి వశము? దేవా, నిత్యవినోదా, నిత్యకళ్యాణా, భోగభాగ్య సంపన్న దేవతామూర్తివి. దేవదేవోత్తముండవు, నిధానకల్పుఁడవు, దేవకీపుత్రుఁడవు.